Kitchenvantalu

మీరు తింటున్న జీడిపప్పు అసలైనదా లేక నకిలీదా? ఇలా ఈజీగా కనిపెట్టవచ్చు!

Fake Cashew Identify : మీరు కొనే జీడిపప్పు అసలైనదా లేక నకిలీదా? మార్కెట్లో విక్రయిస్తున్న కల్తీ జీడిపప్పును తేలికగా గుర్తించడానికి మరియు అసలైన ఒరిజినల్ జీడిపప్పును పసిగట్టడానికి ఈ సింపుల్ చిట్కాలు తెలుసుకోండి.

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. దాంతో డ్రై ఫ్రూట్స్ లలో కూడా నకిలీ వచ్చేసాయి. ఇక ఇప్పుడు జీడిపప్పులో నకిలీ జీడిపప్పును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
jidipappu benefits
జీడిపప్పు రంగు కాస్త పసుపు రంగులో ఉంటే అది నకిలీది అని గుర్తించాలి. జీడిపప్పు తెల్లగా ఉంటే అది స్వచ్ఛమైనది అని అర్థం చేసుకోవాలి. జీడిపప్పు మీద మచ్చలు, నలుపు అలాగే రంధ్రాలు ఉంటే కొనుగోలు చేయకూడదు.

స్వచ్ఛమైన జీడిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నాణ్యత తక్కువ ఉన్న జీడిపప్పు తొందరగా పాడైపోతుంది. నకిలీ జీడిపప్పు తింటుంటే పిండి నమిలిన భావన కలుగుతుంది.

అలాగే జీడిపప్పు తింటున్నప్పుడు పళ్లకు అంటుకుంటే అది నకిలీ జీడిపప్పుగా అర్థం చేసుకోవాలి. జీడిపప్పును తిన్న తర్వాత దంతాలకు అంటుకోకుండా ఉంటే అది స్వచ్ఛమైన జీడిపప్పు అని భావించాలి. అలాగే మంచి వాసన వస్తే అది నిజమైన జీడిపప్పు.. అదే జిడ్డు వాసన వస్తూ ఉంటే అది నకిలీ జీడిపప్పుగా భావించాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."