Beauty TipsHealthhealth tips in telugu

Hair Care: కిచెన్‌లో ఉండే ఈ ఒక్క వస్తువుతో జుట్టు రాలడం శాశ్వతంగా ఆగిపోతుంది!

Amla hair Fall tips: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం మరియు ఒత్తిడి కారణంగా చాలామందిని వేధించే ప్రధాన సమస్య జుట్టు రాలడం (Hair Fall). జుట్టు ఊడిపోతుందని మార్కెట్‌లో దొరికే ఖరీదైన షాంపూలు, కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మీ వంటగదిలోనే దీనికి అద్భుతమైన పరిష్కారం ఉంది!

మన కిచెన్‌లో సులభంగా లభించే ఉల్లిపాయ, మెంతులు, కలబంద, కరివేపాకు వంటి సహజసిద్ధమైన వస్తువులతో జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా, కుదుళ్లను బలంగా మార్చి కొత్త జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు.జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి పలితాన్ని పొందవచ్చు.

మనం తలకు షాంపూ పెట్టి నప్పుడు దాన్ని నేరుగా తలకు అప్లై చేయకూడదు కొన్ని రకాల పదార్థాలు కలిపి వాడటం వలన జుట్టుకి సంబంధించిన కొన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వలన జుట్టు శుభ్రపడుతుంది.

కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెర్బల్ షాంపూలు వాడవచ్చు. అన్ని సమయాలలోనూ హెర్బల్ షాంపులు దొరకవు. కాబట్టి మనం ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. షాంపూ లో నీటిని కలిపి దానిలో ఉసిరికాయ రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

ఉసిరి కాయ రసం తో పాటు బృంగరాజ్ఆకు రసాన్ని షాంపూ లో కలిపి అప్లై చేస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గటమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. కొంతమందికి చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది.

అలాంటివారు షాంపూలో వేపాకుల రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్, దురద,పేల సమస్య తొలగిపోతాయి. తలస్నానం చేసే ముందు కొద్దిగా గోరువెచ్చని నీటితో తలను తడిపితే తలలోని చర్మ కణాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం అప్లై చేసిన పదార్థాలు జుట్టు కణాలలోకి వెళ్ళి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

జుట్టు రాలడానికి చిట్కాలు హెయిర్ కేర్ టిప్స్ తెలుగు కిచెన్ హెయిర్ రెమెడీస్ Hair Fall Control Telugu Telugu Beauty Tips Natural Hair Growth Hair Care Routine Telugu

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."