Beauty TipsHealthhealth tips in telugu

షాంపూలో ఈ 2 వస్తువులు కలిపితే.. హెయిర్ ఫాల్‌కు శాశ్వత చెక్!

Hair Fall Home Remedies In telugu : జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య. దుమ్ము, కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల జుట్టు నిర్జీవంగా మారి ఊడిపోతూ ఉంటుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన ఆయిల్స్, షాంపూలు వాడి విసిగిపోయారా?

అయితే మీకో గుడ్ న్యూస్! మీరు రోజూ వాడే షాంపూకి కేవలం ఈ రెండు చిన్న వస్తువులను జోడిస్తే చాలు.. మీ జుట్టు రాలడం ఆగిపోవడమే కాకుండా పొడవుగా, సిల్కీగా పెరుగుతుంది. ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి? వాటిని ఎలా కలుపుకోవాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఫలించక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు.

కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఓపికగా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. మనం రెగ్యులర్ గా షాంపూ వాడుతూ ఉంటాం కదా…ఆ షాంపులో ఇప్పుడు చెప్పే రెండు పదార్థాలు కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక కప్పు కొబ్బరి నూనె పోయాలి. నూనె కాస్త వేడి అవ్వగానే రెండు స్పూన్ల కలోంజి గింజల పొడిని వేసి తక్కువ మంటపై ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను పల్చని వస్త్రం సాయంతో సపరేట్ చేయాలి. ఈ నూనెను ఒక బాటిల్ లో పోసి నిల్వ చేసుకోవచ్చు.

ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక బౌల్ లో రెగ్యులర్ గా వాడే షాంపును మూడు స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత తయారుచేసి పెట్టుకున్న కలోంజి నూనెను అర స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా పొడి జుట్టు, జుట్టు డామేజ్ కావటం వంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ఇలా ఇంటిలో సహజ సిద్ధంగా చేసుకున్న వాటిని ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."