Iron Kadhai Cooking Tips: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా..
Iron Kadhai Cooking Tips: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా.. ఈ విషయం తెలుసుకోండి..ఒకప్పుడు వంటలను మట్టి పాత్రల్లో, ఇనుము కళాయిల్లో చేసేవారు. కానీ మారుతున్న రోజులను బట్టి వంట చేయటానికి అనేక రకాల పత్రాలు అందుబాటులో ఉన్నాయి. నాన్ స్టిక్ పాన్స్ వచ్చాక.. ఇనుము పాత్రల వాడకం చాలా వరకు తగ్గిపోయింది.
అయితే ఇనుము పాత్రల్లో వంట చేసుకొని తింటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఇనుము పాత్రల్లో వంట చేస్తే.. ఆ ఆహారంలో 90 శాతం ఐరన్ ఉన్నట్టు ఇటివల జరిగిన పరిశోదనలో తేలింది.
ఇనుము పాత్రలో వండిన ఆహారాన్ని తీసుకుంటే రక్త హీనత, ఐరన్ లోపం ప్రమాదాలు తగ్గుతాయి. శరీరంలోని తగినంతగా రక్తం ఉండాలంటే ఐరన్ చాలా అవసరం. అందుకే రక్తహినత సమస్యతో బాధపడేవారికి ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోమని డాక్టర్స్ చెప్పుతూ ఉంటారు.
ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, ఏ పని చేయాలనిపించకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఐరన్ పాత్రలలో ఆహారం వండినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
Cast Iron Kadai
https://amzn.to/3Tl3rDt
ఒకసారి ఆహారం వండిన తర్వాత మరల వేడి చేయకూడదు. ఆహారం వండినప్పుడు వెనిగర్, నిమ్మ వంటి వాటిని ఈ పాత్రలలో వేస్తే ఆహారం తొందరగా చెడిపోతుంది. అలాగే వండిన ఆహారాన్ని ఇనుప పాత్రలలో ఎక్కువసేపు ఉంచకుండా వేరే పాత్రలోకి మార్చాలి.
ఇనుము పాత్రలను శుభ్రం చేయటానికి ఉప్పు,, బేకింగ్ సోడా వేసి ఒకసారి రుద్దుకుని ఆ తర్వాత శుభ్రంగా కడగడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఐరన్ పాత్రల్లో వంట చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


