ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవాలా? అయితే ఇంట్లోనే ఉండే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!
Face Glow Tips:మచ్చలు లేని తెల్లటి, కాంతివంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడుతూ, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి విసిగిపోతుంటారు. రసాయనాలతో నిండిన ఆ ప్రొడక్ట్స్ వాడటం వల్ల తాత్కాలికంగా మెరుపు వచ్చినా, భవిష్యత్తులో చర్మానికి నష్టం వాటిల్లుతుంది.
అయితే, మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే ఎలాంటి ఖర్చు లేకుండా ముఖాన్ని నిగనిగలాడేలా సులభంగా మార్చుకోవచ్చు. చర్మంపై ఉన్న మృతకణాలను, నలుపుదనాన్ని తొలగించి ముఖానికి సహజమైన గ్లో (Natural Glow) తెప్పించే ఆ అద్భుతమైన ఇంటి చిట్కా ఏంటి? దాన్ని ఎలా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి? వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుని మీ చర్మాన్ని మరింత అందంగా మార్చుకోండి.

తెల్లటి మెరిసే చర్మం కోసం ఆరాటపడుతున్నారా అయితే ఈ చిట్కా మీకోసమే..ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయిన పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే సహజసిద్దమైన పదార్ధాలతో మన ఇంటిలో తయారుచేసుకొనే ప్యాక్స్ చాలా బాగా పనిచేస్తాయి.
ఒట్స్ చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. మనలో చాలా మందికి ఒట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసు. ఒట్స్ ని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఒట్స్ పొడి,ఒక స్పూన్ చందనం పొడి,ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేయాలి.
ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడటానికి సహాయపడతాయి. సూర్యడి వేడి నుండి ఉత్పత్తి అయ్యే అల్ట్రా వయెలెట్ రేస్ నుండి కాఫీలోని కెఫిన్ చర్మాన్ని రక్షిస్తుంది. కెఫిన్ టిష్యూ రిపేర్ తోపాటు, సెల్ గ్రోత్ కి దోహదపడుతుంది. చర్మం మృదువుగా మంచి కాంతివంతంగా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

