అటుకులతో కమ్మని గుంత పొంగనాలు: తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్!
Atukula Gunta Ponganalu:తక్కువ నూనెతో అటుకులతో ఇలా గుంత పునుగులు చేయండి..ఉదయం breakfast గా చేసుకోవచ్చు..లేదంటే సాయంత్రం సమయంలో కూడా చేసుకోవచ్చు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా ఏదైనా వేడిగా, రుచిగా, అదే సమయంలో ఆరోగ్యంగా తినాలనిపిస్తే.. ‘అటుకుల గుంత పొంగనాలు’ బెస్ట్ ఆప్షన్. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా చేసుకునే రెసిపీ ఇది.
కేవలం గుప్పెడు అటుకులు, కొద్దిగా బొంబాయి రవ్వ ఉంటే చాలు.. చాలా తక్కువ నూనెతో ఈ కమ్మని పొంగనాలను తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్లు కూడా దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. బయట కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే ఈ గుంత పొంగనాలు పల్లి చట్నీ లేదా టొమాటో చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఈ ఆర్టికల్‌లో చూసేయండి!
కావలసిన పదార్ధాలు
బియ్యము రెండు కప్పులు
అటుకులు అర కప్పు
మినపపప్పు యాభై గ్రాములు
మెంతులు రెండు టీ స్పూన్
పచ్చిమిరపకాయలు ఏడు
ఆవాలు ఒక టీస్పూన్
సెనగపప్పు మూడు టీస్పూన్లు
పెద్ద ఉల్లిపాయ రెండు
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు తగినంత
నూనె అయుదువందలు మిల్లీలీటర్లు
తయారి విధానం
ముందుగా ఒక గిన్నెలో బియ్యం,అటుకులుమరియు మినపపప్పు,మెంతులు వేసి నానబెట్టాలి. 5 గంటలు నానాక పచ్చిమిరపకాయలు మరియు ఉప్పుతో కలిపి రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఆలా వదిలేయాలి. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి.ఆవాలు ,సెనగపప్పు మరియు కరివేపాకు వేయించాలి.ఉల్లిపాయలను వేగించి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ పైన ని పైన రుబ్బుకొని ఉంచుకున్న మిశ్రమంలో కలపాలి.
గుంతపొంగణాల పాత్ర వేడిచేసుకోవాలి.ప్రతి గుంతకి నూనె రాయాలి.ఒక గరిటలో ముద్దను తీసుకొని ప్రతి గుంతలో వేసి మీద నుంచి నూనె చల్లాలి.పొంగణాలు తిరగవేయాలి మరియు గోధుమరంగు వచ్చినంతవరకు వేయించాలి.మంట నుండి దించి అందించాలి.
Source: chaipakodi.com

