కూల్ డ్రింక్స్ వద్దు.. కడుపును చల్లగా ఉంచే అద్భుతమైన పుదీనా జ్యూస్!
Pudina Juice:పుదీనా జ్యూస్..వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… అసలే తీవ్రమైన ఎండలు, వాటికి తోడు వేడి గాలులు… వడ దెబ్బ తగిలే అవకాశాలు సమ్మర్లో చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమయంలో పుదీనా జ్యూస్ వంటివి తాగాలి.
మండే ఎండల వల్ల వచ్చే డీహైడ్రేషన్, వడదెబ్బ, జీర్ణ సమస్యలకు పుదీనా జ్యూస్ అద్భుతమైన ఔషధం. వేసవిలో రోజూ ఒక్క గ్లాసు పుదీనా జ్యూస్ తాగితే మీ శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు ఏంటి? దీన్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
పుదీనా – ఒక కట్ట
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
సోంపు పొడి- ఒక టీ స్పూను
వాము పొడి – అర టీ స్పూను
మిరియాల పొడి – ఒక టీ స్పూను
నిమ్మకాయ రసం – రెండు చెక్కలు
ఉప్పు – తగినంత
నీళ్లు – ఒక లీటరు
తయారుచేసే విధానం
ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ ముద్దను నీటిలో కలిపి అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి, వాము పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన రసాన్ని కుండలో పోసుకుని మనకి అవసరం అయినప్పుడు త్రాగితే చాలా బాగుంటుంది.

