జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? ఈ టమాటో మిరియాల రసం తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది!
Tomato Pepper Rasam:టమాటో మిరియాల రసం.. అదిరిపోయే రుచితో జలుబు, దగ్గులకి మంచి ఉపశమనం..ఈ రసం చేయటం చాలా సులువు. అన్నంలోకి చాలా బాగుంటుంది.
వాతావరణం మారినప్పుడు లేదా జలుబు, దగ్గు చేసినప్పుడు నోటికి ఏదీ రుచించదు. అలాంటి సమయంలో వేడివేడిగా అన్నంలోకి లేదా సూప్లా తాగడానికి టమాటో మిరియాల రసం అత్యంత అనువైనది. ఇది కేవలం రుచినే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అమృతంలాంటి రుచినిచ్చే ఈ టమాటో మిరియాల రసాన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో పూర్తి రెసిపీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
కావలసిన వస్తువులు: టొమాటోలు – మూడు, మిరియాల పొడి – ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు, అల్లం ముక్క – చిన్నది, దాల్చిన చెక్క – చిన్నది, ఉల్లిపాయ – ఒకటి, నూనె – ఒక టీస్పూన్, పుదీనా – కొద్దిగా.
తయారి విధానం : ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి సన్నగా తరిగిన టమాటా ముక్కలు చిన్న అల్లం ముక్క దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి.
ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి పాన్ లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. సిమ్ లో పెట్టి ఉడికించాలి దీనిలో కాస్త నీటిని పోసి రసంలా వచ్చేలాగా మరిగించుకోవాలి అంతే టమాటో మిరియాల రసం రెడీ.

