కాలి గోర్లు మురికిగా, నల్లగా ఉన్నాయా? ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో ఇలా తెల్లగా మెరిపించుకోండి!
Nails Cleaning tips:ముఖ సౌందర్యంపై తీసుకునే శ్రద్ధ, పాదాల మీద చాలా మంది తీసుకోరు. దుమ్ము, ధూళిలో తిరగడం వల్ల, లేదా ఎప్పుడూ షూస్ వేసుకోవడం వల్ల కాలి గోర్లలో మురికి చేరి నల్లగా, అసహ్యంగా మారుతాయి. కొన్నిసార్లు ఫంగస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. గోర్లు మురికిగా ఉండటం వల్ల పాదాల అందం మొత్తం తగ్గిపోతుంది, ఎవరి ముందు అయినా చెప్పులు విప్పాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది.

దీనికోసం ప్రతిసారీ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఖరీదైన పెడిక్యూర్ (Pedicure) చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో, వంటగదిలో దొరికే సహజమైన వస్తువులతోనే (నిమ్మకాయ, బేకింగ్ సోడా, టూత్ పేస్ట్ లాంటివి) మురికి పట్టిన కాలి గోర్లను నిమిషాల్లో ముత్యాల్లా తెల్లగా మెరిపించుకోవచ్చు.
అసలు కాలి గోర్లను సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలి? డెడ్ స్కిన్‌ను ఎలా వదిలించుకోవాలి? ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకునే ఆ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పద్ధతులు ఏమిటో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.
కాలి గోర్లు మురికిగా, నల్లగా ఉన్నాయా..ఇలా చేస్తే నిమిషంలో మెరిసిపోతాయి.. కాలి గోర్లు మురికిగా, నల్లగా మారినప్పుడు ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త ఓపిక,శ్రద్ద పెడితే సరిపోతుంది.
మనం ప్రతి రోజు టూట్ పేస్ట్ వాడుతూ ఉంటాం కదా…ఈ టూట్ పేస్ట్ ఉపయోగించి నల్లగా మారిన గోర్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. గోర్లపై టూట్ పేస్ట్ రాసి రుద్ది 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. అంతే నల్లగా మురికిగా మారిన గోర్లు తెల్లగా మారతాయి.
షాంపూ కూడా మురికిని తొలగించటానికి సహాయపడుతుంది. ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని పోసి దానిలో షాంపూ వేసి బాగా కలిపి ఆ నీటిలో పాదాలను పెట్టి పది నిమిషాలు అయ్యాక టూత్ బ్రష్‌తో గోళ్లను స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.
శనగపిండిలో నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని గోర్లపై రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. శనగపిండి మంచి స్క్రబింగ్ గా పనిచేస్తుంది. మురికిని తొలగించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

