Beauty Tips

కొబ్బరి నూనెలో ‘ఇది’ కలిపి రాస్తే జుట్టు ఊడమన్నా ఊడదు!

Hair Care Tips:జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడి విసిగిపోయుంటే ఈ సింపుల్ నాచురల్ చిట్కా మీకోసమే.

మనం రోజూ వాడే కొబ్బరి నూనెలో ఆ ఒక్క పదార్థం కలిపి జుట్టుకు రాస్తే చాలు.. జుట్టు రాలడం త్వరగా తగ్గిపోవడమే కాకుండా చాలా తక్కువ సమయంలోనే ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. మీ కేశాలను ఆరోగ్యంగా మార్చే ఆ అద్భుతమైన సీక్రెట్ ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

కొబ్బరి నూనెలో కలిపి రాస్తే చాలా తక్కువ సమయంలో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.. మనలో చాలా మంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలని కోరుకుంటారు. జుట్టు పొడవుగా ఉంటేనే ముఖానికి అందం. జుట్టు రాలకుండా ఉండటానికి చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ సమయంలో ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చేయటం చాలా సులువు.

ఒక బౌల్ లో మూడు స్పూన్ల ఉల్లిపాయ రసం, రెండు స్పూన్ల కొబ్బరి నూనె,ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి మాడుకి, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

తలలో రక్తప్రసరణ పెరిగి జుట్టు అవసరమైన పోషకాలు అందుతాయి. దాంతో జుట్టు కుదుళ్లు ఉత్తేజితం అయ్యి జుట్టు రాలకుండా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఫోలికల్స్‌ని ఉత్తేజపరుస్తుంది. దాంతో జుట్టు రాలకుండా పెరుగుతుంది. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన స్కాల్ప్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

దాంతో తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె,ఆలోవెరా కూడా జుట్టు సంరక్షణలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఈ రెమిడీని నెల రోజుల పాటు పాటిస్తే వచ్చే తేడాను చూసి చాలా ఆశ్చర్య పోతారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."