ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుందా? ఈ ఒక్క గ్లాసు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగితే రోజంతా సూపర్ యాక్టివ్!
Dry fruit milkshake:నీరసం తగ్గించి ఆరోగ్యానిచ్చే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్.. వేసవి కాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో వేడి కారణంగా చాలా త్వరగా అలసట,నీరసం వస్తాయి. అలాంటి సమయంలో Dry fruit milkshake తాగితే బాగుంటుంది.
పని ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల రోజంతా అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఉదయం పూట ఈ స్పెషల్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ఎముకలు దృఢంగా మారి, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచే ఈ అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
జీడిపప్పు – గుప్పెడు
బాదం పప్పు – గుప్పెడు
అంజీరా – 5 ముక్కలు
ఖర్జురం – 5-6
చక్కెర – 2-3 స్పూన్స్
పాలు – అర లీటరు
తయారీ విధానం
జీడీపప్పు, బాదంపప్పు, అంజీరా, ఖర్జురంఅన్నింటిని ఒక బౌల్ లో వేసుకుని 5 గంటలు నానబెట్టాలి. బాగా నానాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పాలను వేడి చేసి ఈ పేస్ట్ ని పాలల్లో వేసి బాగాకలపాలి. బాగా మరిగాక పంచదార వేసుకోవాలి. పంచదారకు బదులు తేనే కూడా కలపవచ్చు. ఈ మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది.

