Beauty Tips

White Hair:ఈ నూనెతో ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం

White Hair:ఈ నూనెతో ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. ఒకప్పుడు వయస్సు 60 ఏళ్ళు వచ్చాక తెల్లజుట్టు సమస్య వచ్చేది ఇప్పుడు 25 నుంచి 30 ఏళ్ల లోపే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు.

ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

తెల్లజుట్టు సమస్యను పరిష్కారం చేయటానికి నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది.దీని కోసం నువ్వుల నూనె మ‌రియు కొబ్బ‌రి నూనె స‌మానంగా తీసుకుని బాగా కలిపి రాత్రి పడుకొనే ముందు తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

నువ్వుల నూనెలో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు అంది ఒత్తుగా, న‌ల్ల‌గా ఎదిగేందుకు స‌హాయ ‌ప‌డ‌తాయి. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయ‌డంలో నువ్వుల నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అందువ‌ల్ల‌, రెండు లేదా మూడు రోజుల‌కు ఒక‌సారి నువ్వుల నూనెను జుట్టుకు బాగా ప‌ట్టించి మసాజ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది.

నువ్వుల నూనెను జుట్టు సంరక్షణలో పూర్వ కాలం నుండి వాడుతున్నారు. నువ్వుల నూనె జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."