Beauty Tips

Hair Care Tips:ఎలాంటి జుట్టు సమస్యలైనా సరే.. ఈ హెయిర్ మాస్క్‌తో మటు మాయం..

Hair Care Tips:ఎలాంటి జుట్టు సమస్యలైనా సరే.. ఈ హెయిర్ మాస్క్‌తో మటు మాయం.. Flax Seeds లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందించే Flax seeds ఒక వరం అని చెప్పవచ్చు.

మారిన జీవనశైలి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం లేక నిరాశ చెందుతూ ఉంటారు. అలా నిరాశ చెందకుండా ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది.

ఈ మధ్య కాలంలో ఆవిసే గింజల వాడకం చాలా ఎక్కువ అయింది. ఆవిసే గింజలలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల ఆవిసే గింజలను వేసి 5 నిమిషాల పాటు మరిగిస్తే జెల్ తయారవుతుంది.

ఈ జెల్ ని వేడిగా ఉన్నప్పుడే వడకట్టాలి. ఈ జెల్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు, అలాగే తల మీద చర్మంపై కూడా బాగా పట్టేలా పట్టించాలి. అరగంట అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఆవిసే గింజలలో ఉండే విటమిన్ E జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టు మూలాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. ఈ జెల్ ని ఎక్కువగా తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెట్టి దాదాపుగా 15 రోజుల వరకు వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.