Kitchenvantalu

Vegetable Roti Recipe:అన్ని పోషకాలతో కమ్మగా లాగించాలంటే ఇలా ఈజీగా రోటీలు చేయండి

Vegetable Roti Recipe:అన్ని పోషకాలతో కమ్మగా లాగించాలంటే ఇలా ఈజీగా రోటీలు చేయండి.. గోధుమ పిండితో కూరలను కలిపి ఇలా రోటీలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

కావలసిన పదార్ధాలు
1 కప్పు గోధుమ పిండి
1 కప్పు ఉడికించిన కూరగాయల ముక్కలు(మీకు అందుబాటులో ఉన్న కూరలు)
1 tsp జీరా పొడి
1.5 స్పూన్ నల్ల మిరియాలు పొడి
1 స్పూన్ నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు
2 పచ్చిమిర్చి (సన్నగా తరిగిన)
1 స్పూన్ కొత్తిమీర
నల్ల ఉప్పు మరియు ఉప్పు రుచికి సరిపడా
1/2 స్పూన్ నూనె

తయారి విధానం
ఒక గిన్నెలో ఉడికించిన కూరగాయల ముక్కలను వేసి జీలకర్ర పొడి,మిరియాల పొడి,నిమ్మరసం,ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత గోధుమ పిండి వేసి గోరువెచ్చని నీటితో బాగా కలపాలి. చిన్న గుండ్రని ముద్దను తీసుకోని రోటిలు చేతితో నొక్కండి. మీడియం నుండి తక్కువ మంట మీద బాగా కాల్చండి. అవసరం అయితే నూనె వేసి కాల్చండి. పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."