Pallavi Ramisetty: ఒకప్పటి బుల్లితెర హీరోయిన్ పల్లవి రామిశెట్టి గురించి మీకు తెలుసా..?
Pallavi Ramisetty: ఒకప్పటి బుల్లితెర హీరోయిన్ పల్లవి రామిశెట్టి గురించి మీకు తెలుసా..ఈటీవీ సీరియల్స్‌తో టీవీ రంగంలోకి వచ్చిన పల్లవి తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సంప్రదాయంగా కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర అయ్యి నంది అవార్డ్ కూడా గెలుచుకుంది.
బుల్లితెరలో భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే 2019లో దిలీప్ కుమార్‌ను పెళ్లి చేసుకున్ని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.
పెళ్లయిన రెండేళ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో సీరియల్స్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి మరల ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మాలో కొత్తగా ప్రసారం కానున్న ‘ఇంటింటి రామయణం’ సీరియల్లో నటిస్తుంది.


