బొడ్డులో నూనె రాస్తే ఎంతటి రోగాలైనా పారిపోవాల్సిందే.. అసలు రహస్యం ఇదే!
Belly Button Oiling : మన ప్రాచీన ఆయుర్వేదంలో “నాభి చికిత్స” (Nabhi Chikitsa) కి చాలా ప్రాధాన్యత ఉంది. బొడ్డు అనేది మన శరీరంలోని అనేక నరాలతో అనుసంధానమై ఉంటుంది. రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేసి మెల్లగా మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
అంతేకాకుండా, చర్మం పొడిబారడం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, పీరియడ్స్ నొప్పులు మరియు ఒత్తిడి వంటి సమస్యలకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బొడ్డులో నూనె వేసి మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బొడ్డులో నూనె వేసి కొంత సేపు మర్దనా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. బొడ్డు మన శరీరంలో 72వేల సిరల ద్వారా ప్రతి అవయవానికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల బొడ్డులో నూనె వేసి చికిత్స చేస్తే నరాల చివరలు ఉత్తేజంగా మారుతాయి.

ఆముదంతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు, నరాల మంట, గొంతు కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ లో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్దిగా ఉండుట వలన నొప్పులను తగ్గిస్తుంది.
Also Read: కేవలం 7 రోజుల్లో కీళ్ల నొప్పులు, నీరసం మాయం.. 65 ఏళ్లలోనూ 25 ఏళ్ల ఎనర్జీ మీ సొంతం!
ఆవనూనెతో మసాజ్ చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఆవనూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ అనే సమ్మేళనం ఉండటం వలన శరీరంలోని కొన్ని నొప్పి గ్రాహకాలను డీసెన్సిటైజ్ చేసి నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ నూనెలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం ఉండుట వలన వాపు, మంటలను తగ్గించటంలో సహాయపడతాయి.
Also Read: షాంపూలో ఈ 2 వస్తువులు కలిపితే.. హెయిర్ ఫాల్‌కు శాశ్వత చెక్!
అయితే నూనెతో మసాజ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బొడ్డులో కేవలం 3 చుక్కల నూనెను మాత్రమే వేయాలి. 10 నుంచి 15 నిమిషాలు చాలా నిదానంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో మసాజ్ చేస్తే ఉదయం లేవగానే.. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా మటుమాయం అవుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
బొడ్డులో నూనె మసాజ్ నాభి చికిత్స ఆయుర్వేద ఆరోగ్య చిట్కాలు Belly Button Oiling Benefits Nabhi Therapy Telugu Telugu Health Tips Ayurvedic Home Remedies

