రోజుకి 2 స్పూన్లు తింటే చాలు.. కీళ్ల నొప్పులు, అలసట, రక్తహీనత మాయం!
Atukulu Benefits : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు కీళ్ల నొప్పులు, నీరసం, అలసట మరియు రక్తహీనత (అనీమియా). శరీరంలో పోషకాల లోపం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి.
అయితే, ఎటువంటి కెమికల్స్ లేని ఒక సాధారణ సహజసిద్ధమైన ఆహారాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ ఇంట్లోనే సులభంగా చెక్ పెట్టవచ్చు. రోజుకి కేవలం 2 స్పూన్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్, క్యాల్షియం మరియు అవసరమైన పోషకాలు లభించి తక్షణ శక్తి అందుతుంది.
అటుకులు గురించి మనలో చాలా మందికి తెలుసు. మనలో చాలా మంది అటుకులతో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటారు. అటుకులతో స్వీట్స్ చేసుకోవచ్చు. అలాగే హాట్స్ కూడా చేసుకుంటారు. అటుకులతో ఏమేమి చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తింటే అస్సలు వదలరు. అటుకులలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

రక్తహీనత సమస్య ఉన్నవారికి అటుకులు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే అటుకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.అటుకులలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అటుకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కె, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి.
కాస్త అలసటగా ఉన్నప్పుడు వేడి పాలలో అటుకులను నానబెట్టి తింటే తక్షణ శక్తి వస్తుంది.డయాబెటిస్ తో బాధపడేవారు అటుకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అటుకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో భయంకరమైన వైరస్ ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
అటుకుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి రాకుండా కీళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గుతారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
కీళ్ల నొప్పుల ఉపశమనం రక్తహీనత నివారణ నీరసం తగ్గించే చిట్కాలు తక్షణ శక్తి కోసం హోమ్ రెమెడీస్ తెలుగు Health Tips Telugu Joint Pains Home Remedy Anemia Cure Telugu

