Devotional

New Couple:కొత్త కోడలు ఇంటికి రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా?

New Couple:కొత్త కోడలు ఇంటికి రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా.. సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొడుకుకు పెళ్లి అయిన తర్వాత కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు.

నష్టాలు, బాధల నుండి బయట పాడేసే శక్తి సత్యనారాయణ వ్రతంనకు ఉంది.అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది.సాదారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో జరుపుకుంటారు.ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయి మొదట అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారంగా ఉంది.

సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల విశ్వాసంకొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు.

ఈ వ్రతం చేసుకొనే సమయంలో ఆ ఊరిలో వారి అందరిని పిలుస్తారు.ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది.కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు.దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోను కలిసిపోతుంది.ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటం అత్తమామలు శుభ సూచకంగా భావిస్తారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."