MoviesTollywood news in telugu

Dookudu Movie:మహేష్ మూవీలో ఆడిపాడిన ఈ హీరోయిన్ గుర్తుందా..?

Dookudu Movie Actress Parvati Melton:టాలీవుడ్ పరిశ్రమలో స్థానిక నటీమణులతో పాటు, విదేశీ నటీమణులు కూడా తమ అందంతో మరియు అభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు. వారిలో పార్వతి మెల్టన్ ఒకరు, తన అందంతో యువతను తన వైపుకు తిప్పుకుంది.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మంచు విష్ణు, సుమంత్, నరేష్ వంటి స్టార్ హీరోలతో నటించింది. 2012 నుండి నటనకు దూరంగా ఉంది. దూకుడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో అభిమానుల మనసులను దోచుకున్న ఆమె ఇప్పుడు ఎలా ఉందో.. ఏమి చేస్తుందో తెలుసుకుందాం.

పార్వతి మెల్టన్.. ఇండో అమెరికన్. కాలిఫోర్నియాలో జర్మన్, స్కాట్లాండ్ తండ్రి..పంజాబ్ తల్లికి పుట్టింది.ఆమె చదువు అంతా అమెరికాలోనే జరిగింది. ‘వెన్నెల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఆ తరువాత ‘గేమ్’ లో మంచు విష్ణుతో, ‘మధుమాసం’ లో సుమంత్ తో మరియు ‘అల్లరి నరేష్’ తో ‘అల్లరి అల్లరి’ సినిమాలలో నటించారు.

హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో, సెకండ్ హీరోయిన్ పాత్రలకు మారారు. ‘జల్సా’ చిత్రంలో ఇలియానాకు స్నేహితురాలిగా జ్యోత్స్న పాత్రలో నటించి, ‘జెన్నీఫర్ లోఫేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి’ అని పవన్ కళ్యాణ్ పొగడ్తలతో మరియు ఆమె నటనతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

దూకుడు సినిమాలో మహేష్ బాబుతో ‘పూవై పూవై’ పాటలో ఆటో అప్పారావుగా నటించిన తర్వాత, ఆ పాట యూట్యూబ్‌ను కుదిపేసింది. బాలకృష్ణతో ‘శ్రీమన్నారాయణ’లో మరియు శ్రీరామ్ శంకర్‌తో ‘యమహో యమ’ సినిమాలో నటించింది. మలయాళం మరియు హిందీలో కొన్ని సినిమాలు చేసిన ఆమె, 2013లో వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నారు.

Follow the ChaiPakodi WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ