Types of Salt: ఉప్పులో రకాలు..ఏ ఉప్పు ఏ వ్యాధిని నయం చేస్తుందో తెలుసుకోండి
Types of Salt: ఉప్పులో రకాలు.. ఏ ఉప్పు ఏ వ్యాధిని నయం చేస్తుందో తెలుసుకోండి..ఉప్పు లేకుండా వంటకాలను ఊహించడం కష్టం. ఆహారంలో రుచిని ఉప్పు పెంచుతుంది. కానీ, ఉప్పులో పలు రకాలు ఉండటం చాలా మందికి తెలియదు.
ప్రతి రకం ఉప్పుకు ఒక ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనం ఉంది. మనం ఇప్పుడు మార్కెట్లో లభించే వివిధ ఉప్పుల రకాలు ఏమిటో మరియు వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
సెల్టిక్ సాల్ట్
మన ఇంట్లో వాడే సాధారణ ఉప్పుతో పోలిస్తే సోడియం శాతం చాలా తక్కువగా ఉంటుంది.
బ్లాక్ సాల్ట్
నల్ల ఉప్పును సాధారణ ఉప్పుతో పోల్చితే, దీనిలో సోడియం శాతం తక్కువ. అయినా, ఇది కడుపు ఉబ్బరం, అరుగుదల లోపం, కడుపు నొప్పి, కడుపులో తిప్పడం, గుండె మంట వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ ఉప్పులో పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.
కోషర్ ఉప్పు
సాధారణ ఉప్పుతో పోలిస్తే, ఈ ఉప్పులో గ్రాన్యుల్స్ కొంచెం పెద్దవిగా ఉంటాయి. పరిమిత మోతాదులో రిఫైన్ చేయబడినందున, ఉప్పు శాతం కూడా కొంచెం తక్కువ. అలాగే, దీనిలో ఐయోడిన్ శాతం కూడా తక్కువ.
లో సోడియం సాల్ట్
పేరుకు తగినట్లుగా ఇందులో సోడియం శాతం తక్కువగా, పొటాషియం శాతం అధికంగా ఉండటం వలన, హై బీపీ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరం.
పింక్ సాల్ట్
లేత గులాబీ రంగులో ఉన్న ఈ ఉప్పులో లవణాల శాతం అధికం. దీన్ని మితంగా వాడితే, కండరాల నొప్పులు వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఈ ఉప్పు రక్తప్రసరణను కూడా మెరుగుపరచి, కణాల్లోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
సాధారణ ఉప్పు
ఇది మన ఇళ్లలో సాధారణంగా కనిపించేది. దీనిలో అయోడిన్ ఉంటుంది. అయితే వైద్యులు ఈ ఉప్పును పరిమితంగా వాడాలని సలహా ఇస్తున్నారు. పెద్దలు రోజుకు 5 గ్రాముల సాధారణ ఉప్పును మించి తినరాదని సూచిస్తున్నారు.
సీ సాల్ట్
ఈ ఉప్పులో లవణాల శాతం ఎక్కువ. అయినా ఇది నీటిలో త్వరగా కరగదు.
మార్కెట్లో అనేక రకాల ఉప్పులు లభ్యమవుతున్నాయి. ఏ ఉప్పు ఏ ఉపయోగాలకు అనుకూలమో సరిగ్గా తెలుసుకుని తర్వాతే దాన్ని వాడాలి . బీపీ సమస్యలు ఉన్న వారు లో సాల్ట్ ఉప్పు వాడటం ఉత్తమం అని, శరీరంలో అవసరమైన లవణాల కోసం పింక్ సాల్ట్ వాడవచ్చు అని నిపుణులు చెప్పుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

