Movies

పెళ్లిపై ప్రభాస్ వ్యాఖ్యలను ఖండించిన కృష్ణంరాజు….షాక్ లో ప్రభాస్

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటున్నాడనే వార్త నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. అయితే ఒకానొక సందర్భంలో ఈ పెళ్లి విషయం గురించి అనుష్క స్పందిస్తూ..మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించటంతో ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి అయ్యిపోతుందనే వార్తలు వైరల్ అయ్యేయి. ఈ వార్తలపై ప్రభాస్ స్పందిస్తూ పెళ్లి అనేది నా వ్యక్తిగత విషయం. నాకు ఎంగేజ్ మెంట్ అయిందని ఏవో వార్తలు రాస్తున్నారు. నేను పెళ్లి చేసుకోబోయే ముందు అందరికి చెప్పుతా … ముఖ్యముగా మీడియా మిత్రులకు,అభిమానులకు చెపుతానని ప్రభాస్ అన్నారు.

ఇదే విషయాన్నీ ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు వద్ద ప్రస్తావించగా అయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ప్రభాస్ ఇంకా పెళ్ళికి రెడీగా లేడు. సాహో షూటింగ్ లో బిజీగా ఉండి ఇంటికి కూడా సరిగా రావటం లేదని వాళ్ళ అమ్మ చెప్పింది.

సాహో షూటింగ్ అయ్యిపోయాక ప్రభాస్ ఓకే అంటే పెళ్లి జరుగుతుంది. పెళ్లికూతురు ఎవరు అనేది ప్రభాస్ స్వయంగా చెప్పుతాడు. అప్పటివరకు మీడియా వాళ్ళను ప్రభాస్ పెళ్లి గురించి ఏ వార్తలను రాయవద్దని కృష్ణంరాజు కోరారు. .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."