రమ్యకృష్ణ సంచలన నిర్ణయం… షాక్ లో టాలీవుడ్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ రజనీకాంత్ తో నరసింహ సినిమాలో రజనీకాంత్ తో పోటాపోటీగా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఆమెకు బాహుబలి సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. రాజమౌళి బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు మొదట శ్రీదేవిని అడిగితె… ఆమె కాదని అనటంతో ఆ అవకాశం రమ్యకృష్ణకు వచ్చింది. వచ్చిన ఆ అవాకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకొని శివగామి అంటే రమ్యకృష్ణ…రమ్యకృష్ణ అంటే శివగామి అనేంతలా పేరు తెచ్చుకుంది. బాహుబలి ఎఫెక్ట్ తో చాలా మంది దర్శకులు రమ్యకృష్ణ కోసం పాత్రలను సృష్టిస్తున్నారు. రమ్యకృష్ణ ఎంత పారితోషికం అడిగిన ఇవ్వటానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ ఆర్టిస్ట్ లలో నరేష్ కి రోజుకి లక్షన్నర ఇస్తున్నారట.
ఇక సీనియర్ విలన్ రావు రమేష్ రోజుకి రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తున్నారట. హీరో నుంచి కమెడియన్ గా మారిన సునీల్ రోజుకి 3 నుంచి 4 లక్షలు పారితోషికాన్ని తీసుకుంటున్నాడు.
ఇలా టాలీవుడ్ ఆర్టిస్ట్ లు అందరూ తమ స్థాయిని బట్టి పారితోషికం తీసుకుంటూ ఉండగా రమ్యకృష్ణ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుందట. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తీస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో శైలజారెడ్డి పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కీలకం కావటంతో దాదాపుగా 25 రోజుల పాటు ఈ సినిమాకు కేటాయించిదట. టైటిల్ రోల్ పోషిస్తున్న రమ్యకృష్ణ రోజుకి 6 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. ఈ లెక్కన సినిమా మొత్తానికి కోటిన్నర అవుతుంది.
బాహుబలి సినిమా ముందు అవకాశాల కోసం ఎదురు చుసిన రమ్యకృష్ణ బాహుబలి తర్వాత పరిస్థితి మారి రమ్యకృష్ణ చుట్టూ దర్శక నిర్మాతలు తిరుగుతున్నారు. దాంతో ఆమె పారితోషికాన్ని డిమాండ్ చేసే స్థాయిలో ఉంది.