Kitchenvantalu

Majjiga Charu:ఈ ఎండా వేడికి చలువ చేసేలా ఇలా మజ్జిగ చారు చేసుకు తింటే అదిరిపోతుంది..

Majjiga Charu:ఈ ఎండా వేడికి చలువ చేసేలా ఇలా మజ్జిగ చారు చేసుకు తింటే అదిరిపోతుంది..మజ్జిగ చారు తయారు చేయడం చాలా సులభం. రుచికరమైన సాంప్రదాయ ఆంధ్ర వంటకం.

కావలసిన పదార్థాలు
– పెరుగు – 2 కప్పులు
– నీరు – 1-2 కప్పులు (పలుచగా చేయడానికి)
– ఉప్పు – రుచికి సరిపడా
– పసుపు – చిటికెడు
– ఆవాలు – 1/2 టీస్పూన్
– జీలకర్ర – 1/2 టీస్పూన్
– ఎండుమిర్చి – 1 లేదా 2
– కరివేపాకు – 4-5 ఆకులు
– అల్లం – చిన్న ముక్క (తురిమినది లేదా గుజ్జుగా చేసినది)
– పచ్చిమిర్చి – 1 (సన్నగా తరిగినది) (ఐచ్ఛికం)
– కొత్తిమీర – అలంకరణకు (ఐచ్ఛికం)
– నూనె లేదా నెయ్యి – 1 టీస్పూన్

తయారి విధానం
ఒక గిన్నెలో పెరుగు తీసుకుని దానికి కొంచెం నీటిని కలిపి గడ్డలు లేకుండా బాగా చిలకాలి. చిలికిన పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.

ఒక చిన్న పాన్లో నూనె లేదా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడేక ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం వేగించాలి.

ఈ వేగిన మిశ్రమాన్ని మజ్జిగలో వేసి కలపాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేయడమే. పుల్లని పెరుగు ఉపయోగిస్తే రుచి చాలా బాగుంటుంది. ఈ వేసవికాలంలో మజ్జిగ చారు చేసుకుంటే వేడి చేయకుండా చలవ చేస్తుంది. కాబట్టి మజ్జిగ చారు ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ