Kitchenvantalu

Chimney: కిచెన్ లో చిమ్నీ జిడ్డుగా మారిందా.. క్లీన్ చేసుకునే చిట్కాలు ఇవే..

Chimney:వంట గదిలో చిమ్నీ ఉంటే వంట గదిలో పొగ లేకుండా వంటగది గట్టు జిడ్డు లేకుండా ఉంటుంది. అయితే వంట గదిలో చిమ్నీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. మస్సి, పొగ పేరుకు పోయి సరిగా పనిచేయదు. చిమ్నీ శుభ్రం చేయకపోతే మంటలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చిమ్నీని శుభ్రం చేసుకోవడం మంచిది. చిన్నిని చిన్ని చిన్ని జాగ్రత్తలతో మనం సులభంగా ఇంటిలోనే శుభ్రం చేసేసుకోవచ్చు.

వంటగదిలో చిమ్నీని క్లీన్ చేసే ముందు చిమ్నీ స్విచ్ ఆఫ్ ఆఫ్ చేయాలి. అలాగే కంట్లో దుమ్ము ధూళి పడకుండా కళ్ళజోడు ధరించాలి

చిమ్నీ శుభ్రపరచటానికి ముందు చిమ్మినిలోని అన్ని భాగాలను వేరు చేయాలి. సాధారణంగా చిమ్నీలో ఫిల్టర్లు, గ్రిల్స్ వంటి వస్తువులు ఉంటాయి. వీటిని విడదీయటానికి తయారీ దారి మార్గదర్శకాలను ఫాలో అవ్వాలి.

ఫిల్టర్ అనేది చిమ్నిలో ఒక ముఖ్యమైన భాగం. దీనికే దుమ్ము, ధూళి, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిల్టర్ ను వేరు చేసి సబ్బు నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత బ్రష్ సాయంతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలి.

గ్రిల్ మరియు చిమ్నీ ఇతర భాగాలను సబ్బు నీటితో బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి శుభ్రం చేయాలి. అలాగే చిన్ని లోపల కూడా పేరుకుపోయిన గ్రీస్,పొగ వంటి వాటిని వేడి నీటిని మరియు డిటర్జెంట్ ని ఉపయోగించి శుభ్రం చేయాలి. బాగా మురికిగా ఉంటే బేకింగ్ సోడా కూడా వాడవచ్చు.

అన్ని భాగాలు బాగా శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే చిమ్నీకి మార్చాలి. అన్ని బాగా సెట్ చేసాక పవర్ ఆన్ చేసి సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ