Thati Bellam Coffee:చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే తాటి బెల్లం కాఫీ..
Thati Bellam Coffee:చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే తాటి బెల్లం కాఫీ.. తాటి బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తాటి బెల్లం వాడకం చాలా ఎక్కువ యింది. ప్రతి రోజు తాగే కాఫీలో తాటి బెల్లం వేసుకుంటే మంచిది.
కావాల్సిన పదార్థాలు:
– నీరు – 1 కప్పు
– తాటి బెల్లం – రుచికి సరిపడా
– పాలు (ఫ్యాట్ మిల్క్) – ¼ లీటర్
– కాఫీ పౌడర్ – అవసరమైనంత
తయారీ విధానం:
తాటి బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో నీరు పోసి, అందులో తాటి బెల్లం ముక్కలు వేసి వేడి చేయండి.తాటి బెల్లం కరుగుతుండగా, మరో పాత్రలో పాలు పోసి మరిగించండి.
పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి, కొద్దిగా చల్లారనివ్వండి.తాటి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, కాఫీ పౌడర్ వేసి బాగా కలపండి. మరిగించి స్టవ్ ఆపేయండి.
డికాషన్ కొద్దిగా చల్లారిన తర్వాత, ఒక గ్లాస్లో ¼ వంతు డికాషన్ తీసుకోండి.
దానిలో చల్లారిన పాలు పోసి కలిపి, వేడిగా సర్వ్ చేయండి. డికాషన్ మరియు పాలు మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. తాటి బెల్లంతో తయారు చేసిన కాఫీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.కాబట్టి ఇలా తయారుచేసుకొని తాగటానికి ప్రయత్నం చేయండి. అయితే కాఫీ ఎక్కువగా తాగటం మంచిది కాదు. కాఫీ తాగాలని అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తాగండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

