Healthhealth tips in telugu

Guava Leaves:జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య మరియు బ్యూటీ ప్రయోజనాలు

Guava Leaves:జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య మరియు బ్యూటీ ప్రయోజనాలు.. మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటి గురించి తెలియక వాటి గురించి పెద్దగా పట్టించుకోము. అలాంటి మొక్కలలో జామ మొక్క ఒకటి.

జామ మొక్క ఆకులో ఎన్నో ఆరోగ్య ,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. మెక్సికో మరియు అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలలో పుట్టిన జామ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలా మందికి జామ పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.

కానీ జామ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు.జామ ఆకులో ఉండే లక్షణాలు కారణంగా అనేక సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మనకు తెలియని,జామ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యాన్సర్
జామ ఆకు రసాన్ని తగిన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. జామ ఆకులో విటమిన్ సి, లైకోపీన్, పాలీ-ఫినాల్స్ వంటి సహజ
రసాయన సమ్మేళనాలు ఉండుట వలన క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాక జామ ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ పెరుగుదలను
అరికట్టి పెద్దప్రేగులో విష ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఆహారం ద్వారా వచ్చే కొవ్వు నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

డెంగ్యూ చికిత్స
జామ ఆకు రసాన్ని జ్వరం నివారణకు సహజమైన ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. జామ ఆకులను ఉడికించి తయారుచేసిన రసంను రోజుకి మూడు సార్లు త్రాగితే డెంగ్యూ జ్వరం తగ్గుతుంది. ఈ విధంగా త్రాగితే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య కూడా త్వరగా పెరుగుతుంది.

దృష్టి(విజన్) మెరుగుదల
మన దృష్టి(విజన్) బాగుండాలంటే విటమిన్ A అవసరం. ఈ జామ ఆకుల్లో విటమిన్ A సమృద్దిగా ఉంటుంది. అందువలన ప్రతి రోజు జామ ఆకు రసాన్ని త్రాగితే దృష్టి మెరుగు అవుతుంది. అంతేకాక కంటిశుక్లం మరియు దృష్టి లోపాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియలో మెరుగుదల
జామ ఆకు రసం జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామ ఆకులో ఉండే యాంటి బాక్టీరియల్ఏజెంట్లు జీర్ణాశయ పొరల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను క్రియరహితంగా మార్చేస్తాయి. జామ ఆకు రసాన్ని ప్రతి రోజు మూడు సార్లు త్రాగితే కడుపునొప్పి తగ్గుతుంది.

అతిసారం మరియు విరేచనాలు
అతిసారం మరియు విరేచనాలను తగ్గించటంలో జామ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో గుప్పెడు బియ్యం పిండి, జామ ఆకులను వేసి
మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తీసుకుంటే అతిసారం తగ్గుతుంది. విరేచనాలు తగ్గటానికి జామ ఆకులు మరియు జామ వేర్లు నీటిలో వేసి మరిగించి కాషాయం తయారుచేయాలి. ఈ కషాయాన్ని విరేచనాలు తగ్గే వరకు త్రాగాలి.

బరువు తగ్గటానికి
జామ టీ అనేది శరీరంలో అనవసరమైన కొవ్వును తొలగించుకోవటానికి అత్యంత ప్రభావవంతముగా పనిచేస్తుంది. జామ ఆకులు పిండి పదార్దాలను చక్కెరలుగా
మారకుండా నివారించటం ద్వారా బరువు తగ్గేలా ప్రేరేపిస్తుంది.

డయాబెటిస్
జపాన్ లోని “యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్” వారు జామ ఆకు టీ మీద పరిశోదన జరిపారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు నాలుగు నెలల పాటు జామ ఆకు టీని
త్రాగటం వలన శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్స్ చైతన్యం తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయి. అంతేకాక శరీరం సుక్రోజ్ మరియు మాల్టోజ్
గ్రహించటం కూడా తగ్గటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ పరిశోదన పలితంగా మధుమేహం చికిత్సలో జామ ఆకు టీ సమర్ధవంతగా పనిచేస్తుందని తేలింది.

కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
జామ ఆకు టీ ఒక సహజ కాలేయ టానిక్ గా పనిచేస్తుంది.శరీరంలో అవసరంలేని కొలెస్ట్రాల్ ని తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. జామ ఆకుల టీని 12 వారాల పాటు క్రమం తప్పకుండా త్రాగితే చెడు కొలస్ట్రాల్ LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మరియు ట్రైగ్లిజెరైడ్స్ తగ్గి HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.

థైరాయిడ్ పనితీరులో మెరుగుదల
థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ పనితీరును క్రమబద్దీకరణ చేస్తుంది. జామ ఆకులో రాగి ఎక్కువ మొత్తంలో ఉండుట వలన శరీరం మొత్తం హార్మోన్ల విడుదలలో
నియంత్రణ కలిగి ఉంటుంది.

మలబద్దకం
జామ ఆకుల్లో పీచు పదార్థం అధిక మొత్తంలో ఉండుట వలన మలబద్దకం సమస్య వచ్చినప్పుడు మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.

గాయాలు మరియు ఇన్ఫెక్షన్స్
కోతలు,ఒరిపిడి వంటి గాయాల మీద జామ ఆకు పేస్ట్ రాస్తే తొందరగా నయం అవుతాయి. జామ ఆకులో యాంటి బ్యాక్టిరియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్
ఫెక్షన్ మరియు గర్భాశయం మంట మొదలైనవి త్వరగా నయం అవుతాయి.

బ్లాక్ హెడ్స్
జామ ఆకు రసాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రోజుకి మూడు సార్లు రాస్తూ ఉంటే క్రమంగా బ్లాక్ హెడ్స్ మాయం అవుతాయి.

మొటిమలు మరియు నల్ల మచ్చలు
జామ ఆకుల్లో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. ఈ విటమిన్ C మొటిమలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జామ ఆకుల్లో యాంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణమైన బాక్టీరియాను నియంత్రిస్తుంది.

యాంటి ఏజింగ్ ప్రయోజనాలు
ఫ్రీ రాడికల్స్ వలన మీ చర్మం దెబ్బ తింటుందా? అయితే మీకు జామ సహాయపడుతుంది. మీ చర్మాన్ని వృద్దాప్య చాయల నుండి రక్షించటం,చర్మ టోన్, నిర్మాణం ను మెరుగుపరచటానికి, ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలించటానికి జామ సహాయపడుతుంది. అంతేకాక జామ పేస్ట్ చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది.

అలెర్జీలు
అలెర్జీలను జామ ఆకు తొందరగా నయం చేస్తుంది. జామ ఆకులో లో ఉండే హిస్టామిన్అ నే మిశ్రమం అలెర్జీని వెంటనే నిరోదిస్తుంది. జామ ఆకులను మెత్తని పస్త గా చేసి ప్రభావవంత మైన ప్రాంతంలో రాస్తే సరిపోతుంది.

జుట్టు నష్టం
ఎవరికైనా తల మీద ఒత్తైన జుట్టు ఉంటేనే అందం. అలాగే జుట్టును ఇష్టపడని వారు ఎవరు ఉండరు. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే జామ ఆకుల్లో నీటిని పోసి
మిక్సీ చేసి రసం తీసి తల మీద చర్మం మీద ఆ రసాన్ని పోసి మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే తేడాను మీరే గమనించవచ్చు.

జామ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో పెరుగు కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మరి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి ఈ రేమిడిని ఫాలో అవ్వవచ్చు.

ఇలా జామ ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటిలో ఒక జామ మొక్క ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

పొడి చర్మం ఉన్నవారికి ఇప్పుడు చెప్పే ప్యాక్ సహాయపడుతుంది. జామ ఆకుల పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్, 1 గుడ్డు పచ్చసొన, 1 టేబుల్ స్పూన్ తేనె.కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇప్పుడు చెప్పే ప్యాక్ ముఖం మీద జిడ్డును తొలగిస్తుంది. జామ ఆకుల పేస్ట్ లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే సరిపోతుంది. జిడ్డు కారణంగా వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి.

జామ ఆకుల పేస్ట్ లో పసుపు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

హైడ్రేషన్: జామపండులో హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల పొడి చర్మానికి మేలు చేస్తుంది.

ఎక్స్‌ఫోలియేషన్: జామపండు చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది, ప్రకాశవంతమైన చర్మాన్ని వెల్లడిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు: జామ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి మరియు వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

మొటిమల చికిత్స: జామ ఆకుల సారం చర్మానికి నేరుగా పూసినప్పుడు మొటిమలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

జామ ఆకులలో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి, జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తాయి మరియు మందపాటి మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా మరియు జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా కాపాడటం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

జామ ఆకులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మరియు దానిలోని చుండ్రును నియంత్రించడంలో మరియు చర్మం శుభ్రంగా, పొరలుగా లేకుండా ఉండటంలో మీ జుట్టుకు సహాయపడతాయి

జామ ఆకులను మెత్తని పేస్ట్ లా చేసి, కలబంద జెల్ లేదా పెరుగుతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. ఈ మాస్క్ ను మీ తలకు మరియు జుట్టుకు అప్లై చేసి, 30 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

ఇలా చేయటం వలన చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు మరియు చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

అధిక బరువు ఉన్నవారు ఉదయం సమయంలో జామ ఆకుల టీ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి పైసా ఖర్చు ఎల్కుండా జామ ఆకులను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. మీ ఇంటిలో జామ చెట్టు లేకపోతే వెంటనే జామ చెట్టును పెంచుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ