Kitchenvantalu

Kitchen Tips;ప్రెషర్ కుక్కర్ అడుగున మాడిపోయిందా? సులభంగా శుభ్రం చేసే సింపుల్ చిట్కాలు..

kitchen tips:ప్రెషర్ కుక్కర్ అడుగున మాడిపోయిందా? సులభంగా శుభ్రం చేసే సింపుల్ చిట్కాలు.. జస్ట్ కొన్ని నిమిషాల్లో శుభ్రం చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా శుభ్రం చేసేయవచ్చు.

ప్రెషర్ కుక్కర్ అడుగున మాడిపోతే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఒక కప్పు నీటిలో నిమ్మరసం కలిపి కుక్కర్ అడుగు భాగంలో పోసి మరిగించాలి. దాంతో నలుపు పోతుంది.

కుక్కర్ పూర్తిగా నల్లగా మాడిపోతే కల్లుప్పు వేసి కొంచెం సేపు అలా ఉంచేస్తే శుభ్రం అవుతుంది.

కుక్కర్ అడుగు బాగా అంటుకుంటే బేకింగ్ సోడా వేసి పొడి cloth లేదా కాటన్ తో తుడిస్తే సరిపోతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మరసం వెనిగర్ కలిపి కుక్కర్ అడుగు భాగంలో పోసి మరిగించాలి. దాంతో నలుపు పోతుంది.

నిమ్మరసం, సబ్బు పొడి కలిపి నల్లగా అయిన బాగంపై వేసి రుద్దితే శుభ్రం అయ్యిపోతుంది.

వెనిగర్, ఉల్లి రసం కలిపి శుభ్రం చేసిన మంచి పలితం కనపడుతుంది. ఇప్పుడు చెప్పిన చిట్కాలు అన్నీ బాగా పనిచేస్తాయి. మీకు లభించిన పదార్ధాలను బట్టి ఈ చిట్కాలను ఫాలో అయితే చాలు. తెల్లని మెరిసే కుక్కర్ సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ