Healthhealth tips in telugu

Sweets And Water:స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా ? ఎంత డేంజరో తెలుసా..

Sweets And Water:స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? దాదాపు అందరూ తీపి రుచులను ఆస్వాదిస్తారు. అయితే, చాలా మంది స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగుతారు, ఇది సర్వసాధారణ అలవాటు. కానీ, ఇలా చేయడం వల్ల శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా? నిపుణులు దీని గురించి ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.

ఒక్కమాటలో చెప్పాలంటే, స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిపుణుల ప్రకారం, స్వీట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి, దీన్ని షుగర్ స్పైక్ అంటారు. ఇది ముఖ్యంగా రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నవారికి హానికరం. స్వీట్స్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల ఈ షుగర్ స్పైక్ మరింత తీవ్రమవుతుంది.

అయితే, ఆహారం జీర్ణం కావడానికి నీరు సహాయపడుతుంది. కాబట్టి, స్వీట్స్ తినే ముందు లేదా కొంత సమయం తర్వాత నీళ్లు తాగడం మంచిది. స్వీట్స్ తిన్నప్పుడు దంతాల్లో బ్యాక్టీరియా చురుకుగా మారుతుంది. కొంత సమయం తర్వాత నీళ్లు తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలగడానికి సహాయపడుతుంది.

స్వీట్స్ మాత్రమే కాదు, ఏ ఆహారం తిన్నా, గంట లేదా రెండు గంటల తర్వాత నీరు తాగడం దంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దంత సమస్యలు ఉన్నవారు దంతవైద్యుడిని క్రమం తప్పక సంప్రదించాలి. దంత సమస్యల నివారణకు స్వీట్స్ తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ