Sink Cleaning Tips:కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతోందా? ఇలా చేస్తే చాలు..దుర్వాసన కూడా రాదు..
Sink Cleaning Tips:కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతోందా? ఇలా చేస్తే చాలు..దుర్వాసన కూడా రాదు..మనం సాధారణంగా వంటగది సింక్‌లో వంట పాత్రలు, భోజనం చేసిన పళ్లెంలు కడుగుతూ ఉంటాం. దీంతో, సింక్‌లోని పైపులలో వ్యర్థ పదార్థాలు చేరి నీళ్లు సరిగ్గా పోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా, సింక్ మురికి నీళ్లతో నిండి, దుర్వాసన వస్తుంది. సింక్‌ను, దాని పైపులను శుభ్రంగా ఉంచడానికి కొన్ని సులభమైన పద్ధతులను తెలుసుకుందాం:
1. సింక్‌లో నీళ్లు నిలిచిపోతే, వెంటనే ప్లంజర్‌ను సింక్ రంధ్రంపై ఉంచి గట్టిగా నొక్కి, పైకి లాగాలి. చిన్న అడ్డంకులైతే ఈ విధంగా తొలగిపోయి, నీళ్లు సులభంగా పైపులోకి పోతాయి. తర్వాత వేడి నీళ్లతో సింక్‌ను శుభ్రం చేయాలి.
2. బేకింగ్ సోడా, వెనిగర్: సింక్‌లో అర కప్పు బేకింగ్ సోడా చల్లి, దానిపై అర కప్పు వెనిగర్‌ను స్ప్రే చేయాలి. ఈ మిశ్రమం పైపులోకి జారి, అక్కడి వ్యర్థాలను కరిగిస్తుంది. 15 నిమిషాల తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లు పోస్తే, వ్యర్థాలు తొలగిపోయి సింక్ శుభ్రమవుతుంది. నెలకు ఒకసారి ఈ పద్ధతిని అనుసరిస్తే సింక్‌లో సమస్యలు రావు.
3. వేడి నీళ్లు, సర్ఫ్: కొన్నిసార్లు నూనె, వ్యర్థాలు పైపులలో గడ్డలా పేరుకుని నీళ్లు నిలిచిపోతాయి. అలాంటప్పుడు, మూడు గ్లాసుల వేడి నీళ్లలో కొద్దిగా సర్ఫ్ లేదా షాంపూ కలిపి, సింక్‌లో పోయాలి. 10 నిమిషాల వ్యవధిలో ఈ విధానాన్ని రెండుసార్లు చేస్తే, వ్యర్థాలు కరిగి, పైపు శుభ్రమవుతుంది.
4. ఉప్పు, నిమ్మరసం: అర కప్పు ఉప్పులో నాలుగు చెంచాల నిమ్మరసం కలిపి, రాత్రి సింక్‌లో పరచాలి. ఉదయం వేడి నీళ్లు పోస్తే, 5 నిమిషాల్లో సింక్ శుభ్రమై, దుర్వాసన కూడా పోతుంది. వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని పాటిస్తే, నీళ్లు నిలవకుండా ఉంటాయి.
5.రోజువారీ శుభ్రత: గిన్నెలు, పళ్లెంలు కడిగిన వెంటనే సింక్‌లోని వ్యర్థాలను తొలగించాలి. బ్రష్‌తో సింక్‌ను రుద్ది, నీళ్లు పోస్తూ శుభ్రం చేయాలి. సింక్ కింది మోరీలో తరచూ ఒక బకెట్ వేడి నీళ్లు పోస్తే, పైపులు శుభ్రంగా ఉంటాయి. ఈ సులభమైన చిట్కాలతో సింక్‌ను శుభ్రంగా, సమస్యలు లేకుండా ఉంచుకోవచ్చు!
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

