Kitchen Tips: వర్షాకాలంలో పచ్చళ్లు చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Kitchen Tips:సాధారణంగా మనం ఇంట్లో టమాటా, ఉసిరి, మామిడి, నిమ్మ లాంటి చాలా రకాల నిల్వ పచ్చళ్లను పెడుతూ ఉంటాం. వేడి వేడి అన్నంలో పచ్చడి, కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. వర్షాకాలంలో పచ్చళ్లు చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1. గాజు సీసాలు వాడండి
చాలామంది పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేస్తారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. ప్లాస్టిక్ రంగు, వాసన పచ్చడితో కలిసి, చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, గాజు సీసాలు ఉపయోగించడం మంచిది. సీసాను శుభ్రంగా కడిగి, బాగా ఆరబెట్టి, అందులో పచ్చడి నిల్వ చేయాలి. ఇలా చేస్తే పచ్చళ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
2. సరిపడా ఉప్పు, నూనె వేయండి
పచ్చళ్లలో ఉప్పు, నూనె సరైన మోతాదులో వేయడం వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి, పచ్చడి తయారీలో ఈ రెండింటినీ జాగ్రత్తగా వాడాలి.
3. తేమ ప్రదేశాల నుంచి దూరంగా ఉంచండి
తేమ ఉన్న చోట పచ్చళ్లను పెట్టకూడదు, ఎందుకంటే తేమ వల్ల అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కిటికీలు, తలుపుల దగ్గర లేదా ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా నిల్వ చేయకండి.
4. తడి చేతులు, స్పూన్ వాడకండి
తడి చేతులతో పచ్చడిని ముట్టుకోకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన, పొడి స్పూన్‌తోనే పచ్చడి తీసుకోవాలి. పచ్చడి తీసిన తర్వాత స్పూన్‌ను సీసాలో వదిలేయకండి, ఇది కూడా చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది.
5. తరచూ మూత తీయకండి
పెద్ద మొత్తంలో పచ్చడి నిల్వ చేసినప్పుడు, సీసా లేదా జాడీ మూతను తరచూ తెరవకూడదు. 10 రోజులకు సరిపడా పచ్చడిని ఒక చిన్న డబ్బాలో తీసుకొని, రోజువారీ వాడకం కోసం ఉపయోగించండి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే, వర్షాకాలంలో కూడా పచ్చళ్లు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

