Mushroom Tikki: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ టిక్కీ సులభంగా ఇంట్లోనే చేసుకుందాం
Mushroom Tikki: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ టిక్కీ సులభంగా ఇంట్లోనే చేసుకుందాం.. ఇప్పుడు చెప్పే విధానంలో చేసుకుంటే చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
– పుట్టగొడుగులు – 1 కప్పు
– నూనె – 1 టీస్పూన్
– అల్లం – 1 టీస్పూన్
– పచ్చిమిర్చి – 1
– నల్ల యాలక – 1
– ఉడికించిన ఆలుగడ్డలు – 3
– ఉప్పు – తగినంత
– పసుపు – అర టీస్పూన్
– గరం మసాలా – అర టీస్పూన్
– ధనియాల పొడి – అర టీస్పూన్
– కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
– కొత్తిమీర – కొద్దిగా
– చాట్ మసాలా – కొద్దిగా
తయారీ విధానం:
1. పాన్‌లో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన పుట్టగొడుగులను వేసి వేగించాలి.
2. పుట్టగొడుగులు కాస్త వేగిన తర్వాత, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.
3. ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డలను తీసుకుని మెత్తగా మెదపాలి.
4. ఆలుగడ్డల్లో పసుపు, ధనియాల పొడి, కార్న్‌ఫ్లోర్, గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి.
5. వేగించిన పుట్టగొడుగుల మిశ్రమాన్ని కూడా జోడించి బాగా కలపాలి.
6. నల్ల యాలకను దంచి, ఆ పొడిని మిశ్రమంలో వేసి కలపాలి.
7. స్మోకీ రుచి కోసం, బొగ్గును కాల్చి, ఒక చిన్న గిన్నెలో వేసి, మిశ్రమం మధ్యలో ఉంచి, గిన్నెపై మూత పెట్టాలి.
8. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని, చేతితో ఉండలుగా చేసి, టిక్కీల ఆకారంలో వత్తాలి.
9. టిక్కీలను కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించాలి.
10. పాన్‌లో నూనె వేసి, టిక్కీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.

