beetroot garelu: నోరూరించే బీట్రూట్ గారెలు తయారీ విధానం.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..!
బీట్‌రూట్‌తో గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు:
– బీట్‌రూట్ తురుము – 1 కప్పు
– ఉల్లిపాయ తరుగు – 1/2 కప్పు
– శనగపప్పు – 1/2 కప్పు
– నూనె – సరిపడా
– ఎండుమిర్చి – 7
– సోంపు – 1/2 టీస్పూన్
– జీలకర్ర – 1/2 టీస్పూన్
– ఉప్పు – తగినంత
తయారీ విధానం:
1 శనగపప్పును 4-5 గంటలు నీటిలో నానబెట్టండి.
2. నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, సోంపు, జీలకర్ర, ఉప్పును మిక్సీ జార్‌లో వేసి, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి.
3. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఉల్లిపాయ తరుగు, బీట్‌రూట్ తురుము వేసి బాగా కలపండి.
4. స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేడి చేయండి.
5. పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుని, గారెల్లా ఒత్తి, వేడి నూనెలో డీప్ ఫ్రై చేయండి. లేదా, పెనంపై కొద్దిగా నూనె వేసి, రెండు వైపులా కాల్చండి.
6. సాయంత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్‌గా ఇస్తే, వారు ఇష్టంగా తింటారు.

