Kitchenvantalu

Senagala Vada:కేవలం 10 నిమిషాల్లో వేడి వేడిగా కరకరలాడే రుచికరమైన “శనగల వడలు”

Senagala Vada:కేవలం 10 నిమిషాల్లో వేడి వేడిగా కరకరలాడే రుచికరమైన “శనగల వడలు”.. శనగలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శనగలను వారంలో రెండు సార్లు తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి.
కావలసిన పదార్థాలు:
– నానబెట్టిన శనగలు – 1 కప్పు
– ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
– అల్లం ముక్కలు – 2 టీస్పూన్లు
– పచ్చిమిర్చి – 5
– ఉప్పు – తగినంత
– జీలకర్ర – 1 టీస్పూను
– కరివేపాకు – కొద్దిగా
– నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:
ముందుగా శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి, శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్రను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఉల్లిపాయ తరుగు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే, రుచికరమైన శనగల వడలు సిద్ధం! వానాకాలంలో వేడివేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."