Smart Phone:అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తూ ఉంటున్నారా.. అయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే..
Smart Phone:అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తూ ఉంటున్నారా.. అయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే.. కొందరు రాత్రి 12 గంటలు దాటినా నిద్రపోలేరు. రాత్రంతా మెలకువగా ఉండి, పొద్దున నిద్ర ముంచుకొస్తుంది, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్రిటన్ పరిశోధకుల ప్రకారం, నిద్రలేమి సమస్య ఎక్కువవుతోంది. సరైన నిద్ర అలవాట్లు లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్ శాస్త్రవేత్తలు రాత్రి లేటుగా మెలకువగా ఉండే వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు. వీరి నిద్ర, లేచే సమయాలు స్థిరంగా ఉంటాయని, వీరు తీసుకునే ఆహారంలో కెఫిన్ ఎక్కువగా ఉంటుందని గమనించారు. లేటుగా నిద్రపోయి, ఆలస్యంగా లేవడం సాధారణంగా అనిపించినా, ఇది ఆరోగ్యం మరియు జీవనశైలిపై పెద్ద ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి వ్యక్తి శరీరంలో రోజు-రాత్రి సమయ పట్టిక ఉంటుంది, ఇది సూర్యోదయం, సూర్యాస్తమయంతో సమతుల్యంగా ఉండాలి. అప్పుడే మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుంది. లేకపోతే, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసే ప్రపంచంలో, లేటు నిద్ర అలవాటు ఉన్నవారు పగటి పనుల్లో ఉత్సాహం కోల్పోతారు. రాత్రిపూట శక్తివంతంగా ఉండి, పగలు నీరసంగా మారుతారు, దీనివల్ల పనితీరు దెబ్బతింటుంది.
లేటుగా నిద్రపోయే వారు 6-8 గంటల నిద్రను పొందలేరు. రాత్రి 2-3 గంటలకు నిద్రిస్తే, ఉదయం 6-7 గంటలకు లేవాల్సి ఉంటుంది. దీంతో సరిపడా నిద్ర లేక కళ్ళు, శరీరం సరిగా పనిచేయవు, ఫిట్‌నెస్ కోల్పోతారు.
నిద్ర సరిచేసే చిట్కాలు:
21 మంది రాత్రి 2 గంటల తర్వాత నిద్రపోయి, ఉదయం 9 గంటలకు లేచే వారిపై పరిశోధన జరిగింది. వారికి ఈ చిట్కాలు సూచించారు:
– సాధారణం కంటే 2-3 గంటలు ముందుగా లేవండి.
– ఉదయం ఎండలో కొంత సమయం గడపండి.
– వీలైనంత త్వరగా ఉదయం భోజనం చేయండి.
– రోజూ ఉదయం వ్యాయామం చేయండి.
– రోజూ ఒకే సమయంలో భోజనం చేయండి, సాయంత్రం 7 తర్వాత ఏమీ తినవద్దు.
– మధ్యాహ్నం 3 తర్వాత కెఫిన్ తీసుకోవద్దు.
– సాయంత్రం 4 తర్వాత కునుకు వచ్చినా నిద్రపోవద్దు.
ఈ నియమాలను కచ్చితంగా పాటించడంతో ఒక వారంలోనే వారి నిద్ర సమయం 2-3 గంటలు ముందుకు వచ్చింది. నిద్ర సమయం తగ్గలేదు, కేవలం సమయ పట్టిక మారింది. ఒకవేళ మళ్లీ రాత్రి లేటుగా నిద్రపోతే, ఈ చిట్కాలను 1-2 రోజులు పాటిస్తే నిద్ర సమయం సర్దుబాటవుతుంది.
ఈ చిట్కాలు ఎవరైనా పాటించవచ్చని, సరైన నిద్ర సమయాన్ని సాధించడంలో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా సమయ పట్టిక సర్దుబాటు చేసుకుంటే మగత, ఒత్తిడి, కుంగుబాటు వంటివి తగ్గుతాయని వారు పేర్కొన్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

