Healthhealth tips in teluguKitchenvantalu

Garlic Milk: వెల్లుల్లి పాలు ఆరోగ్యానికి వరం.. ఆ సమస్యలు దూరం.. ఎలా తయారుచేయాలంటే..

Garlic Milk: వెల్లుల్లి పాలు ఆరోగ్యానికి వరం.. ఆ సమస్యలు దూరం.. ఎలా తయారుచేయాలంటే.. వెల్లుల్లి అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కథనంలో వెల్లుల్లి పాలను ఎలా తయారు చేయాలి, వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

వెల్లుల్లి, పాలు విడిగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచివే. వీటిని కలిపి తీసుకోవడం ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి పాల తయారీ విధానాన్ని ఇక్కడ చూద్దాం.

వెల్లుల్లి పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు:
– పాలు – 1 కప్పు
– వెల్లుల్లి రెబ్బలు – 2 నుంచి 4
– పటిక బెల్లం లేదా తేనె – 1 లేదా 2 టీస్పూన్లు
– పసుపు – చిటికెడు
– మిరియాల పొడి – చిటికెడు

తయారీ విధానం:
1. వెల్లుల్లి రెబ్బలను ఒలిచి, చిన్న ముక్కలుగా కట్ చేసి, మెత్తగా నలగగొట్టాలి.
2. ఒక పాత్రలో 1 కప్పు పాలు తీసుకొని, స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
3. పాలు మరిగిన తర్వాత నలిగిన వెల్లుల్లిని వేసి, వెల్లుల్లి మెత్తగా ఉడికే వరకు 8-10 నిమిషాలు మరిగించాలి.
4. వెల్లుల్లి కారం పాలలో కలిసేలా బాగా ఉడికించాలి.
5. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి, స్టవ్ ఆపేసి పాలను దించాలి.
6. పాలు గోరువెచ్చగా చల్లారిన తర్వాత, పటిక బెల్లం లేదా తేనె కలపాలి.
7. తాగే ముందు చెంచాతో వెల్లుల్లిని బాగా చిదిమి, వడపోకుండా నమిలి తాగాలి.

గమనిక: డయాబెటిస్ లేదా రక్తపోటు ఉన్నవారు బెల్లం లేదా తేనె కలపకుండా పాలను తాగవచ్చు. పిల్లలకు ఇవ్వడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

వెల్లుల్లి పాలు తాగడం వల్ల ప్రయోజనాలు:
1. శ్వాస సంబంధ సమస్యలకు ఉపశమనం: పసుపు, మిరియాలు కలిసిన ఈ పాలు యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కఫాన్ని తొలగించి, శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలకు ఇవి చక్కని పరిష్కారం.
2. రోగనిరోధక శక్తి పెరుగుదల: వెల్లుల్లిలోని సల్ఫర్ మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
3. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అజీర్తి, గ్యాస్, ఆమ్లత, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఈ పాలు సహాయపడతాయి.
4. కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఈ పాలు సహాయపడతాయి.
5. నొప్పి నివారణ: వెల్లుల్లిలోని సహజ నొప్పి నివారణ గుణాలు నడుము, కీళ్లు, చేతులు, కాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

జాగ్రత్తలు:
వెల్లుల్లి పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, కొందరికి అలెర్జీ కలిగించవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడుతున్నవారు లేదా ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పాలను తీసుకోవాలి.

ఈ సులభమైన వెల్లుల్లి పాల తయారీతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."