Kitchenvantalu

Tomato pachadi:కేవలం 5 నిమిషాల్లో సింపుల్ “టమాటో పచ్చడి”.. ఇలా చేసుకోండి.. నోట్లో నీళ్లూరుతాయి

Tomato pachadi:కేవలం 5 నిమిషాల్లో సింపుల్ “టమాటో పచ్చడి”.. ఇలా చేసుకోండి.. నోట్లో నీళ్లూరుతాయి.. ఈ పచ్చడి పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది.

టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
టమాటాలు – 3 (మధ్యస్థ పరిమాణం)
నూనె – స్వల్పం
పచ్చిమిర్చి – తగినంత
వెల్లుల్లి రెబ్బలు – 10
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – కొంచెం

తయారీ విధానం:
టమాటాలను శుభ్రంగా కడిగి, కొద్దిగా పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. అలాగే, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.స్టవ్‌పై కడాయి పెట్టి, నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత, కోసిన టమాటా ముక్కలను వేసి, మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి.

అందులో తరిగిన పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి కలపాలి. మూత పెట్టి, మీడియం మంటపై టమాటాల చర్మం విడిపోయే వరకు మగ్గనివ్వాలి. ఈ సమయంలో మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది.

టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, చర్మాన్ని తీసేయాలి. ఆపై టమాటాలను ఒక మిక్సింగ్ గిన్నెలోకి తీసుకుని, ఉప్పు వేసి గరిటె లేదా పప్పుగుత్తితో మెత్తగా మెదడాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపితే, రుచికరమైన “టమాటా పచ్చడి” సిద్ధం!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."