Kitchenvantalu

Biyyam Pindi Rotte:బియ్యంపిండితో హెల్తీగా రుచిగా 10నిమిషాల్లో ఇలా “రొట్టెలు” చేయండి..

Biyyam Pindi Rotte:బియ్యంపిండితో హెల్తీగా రుచిగా 10నిమిషాల్లో ఇలా “రొట్టెలు” చేయండి.. మనం వంటింట్లో బియ్యం పిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో రొట్టెలు కూడా తయారు చేయవచ్చు. పూర్వకాలంలో ఈ రొట్టెలను ఎక్కువగా చేసేవారు. బియ్యం పిండి రొట్టెలు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ రొట్టెల తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం పిండి రొట్టెల తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం పిండి – 1½ కప్పు
నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది)
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2
సన్నగా తరిగిన కరివేపాకు – 1 రెమ్మ
నూనె – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినంత

బియ్యం పిండి రొట్టెల తయారీ విధానం:
ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కరివేపాకు వేసి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని మెత్తగా కాకుండా కలపాలి.

ఒక పాలిథీన్ కవర్‌పై కొద్దిగా నూనె రాసి, కావలసిన పరిమాణంలో పిండిని తీసుకొని, చేత్తో వత్తుకుంటూ పలచగా కాకుండా రొట్టె ఆకారంలో చేయాలి.ఒక పెనంపై నూనె వేసి, ముందుగా తయారు చేసిన రొట్టెను వేసి, రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చాలి.ఈ విధంగా చేస్తే రుచికరమైన బియ్యం పిండి రొట్టెలు సిద్ధమవుతాయి.

ఈ రొట్టెలు రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీటిని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."