Kitchenvantalu

Kitchen Hacks:వర్షాకాలంలో బియ్యం, పప్పులకు పురుగులు పట్టకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి..

Kitchen Hacks:వర్షాకాలంలో బియ్యం, పప్పులకు పురుగులు పట్టకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి.. వర్షాకాలంలో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో ఆహార పదార్థాల నిల్వలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

తేమ ఎక్కువగా ఉండటం వల్ల బియ్యం, పప్పులు, గోధుమల వంటి ధాన్యాలలో కీటకాలు, పురుగులు సులభంగా చేరతాయి. ఒక్కసారి పురుగులు పట్టినట్లయితే వాటిని తొలగించడం అంత సులభం కాదు. అయితే, కొన్ని సులభమైన సహజ చిట్కాలతో ఈ సమస్యను నివారించవచ్చు.

మార్కెట్‌లో లభించే రసాయన పొడులు ఉపయోగించడం వల్ల ఆహారం కలుషితం కావచ్చు. అందుకే, సహజసిద్ధమైన పద్ధతులతో పురుగులను నివారించడం ఉత్తమం. దీనికి కేవలం 10 రూపాయల విలువైన ముడి పసుపు సరిపోతుంది.

పురుగుల నుండి ధాన్యాలను కాపాడే సులభమైన చిట్కా:
మార్కెట్ నుండి ముడి పసుపు ముద్దను కొనండి.దానిని ఒక రోజు ఎండలో ఆరబెట్టి, తేమ పూర్తిగా తొలగించండి.పసుపును చిన్న ముక్కలుగా కోసి, ఒక కాటన్ గుడ్డలో 4-5 ముక్కలను వేసి మూట కట్టండి.ఈ మూటను బియ్యం, పప్పులు, గోధుమలు నిల్వ చేసే డబ్బాలలో ఉంచండి.పసుపు వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే పురుగులు ఉన్నా, ఈ వాసనకు అవి పారిపోతాయి.

ప్రత్యామ్నాయ చిట్కాలు:
పసుపు అందుబాటులో లేకపోతే, బియ్యంలో కొద్దిగా గళ్ల ఉప్పు కలపవచ్చు. అయితే, బియ్యం వాడే ముందు ఉప్పు పూర్తిగా కడిగి వేయాలి.
నిల్వ డబ్బాలు ఎల్లప్పుడూ పొడిగా, తేమ లేకుండా ఉంచండి.
ఎండు మిరపకాయలను డబ్బాలలో వేసినా పురుగులు రాకుండా నివారించవచ్చు.

ఈ సులభమైన చిట్కాలతో వర్షాకాలంలో ధాన్యాలను కీటకాల నుండి సురక్షితంగా ఉంచవచ్చు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ