Vinayaka Chavithi Prasadalu:వినాయక చవితి ప్రసాదాలు..పులిహోర
Pulihora Recipe:వినాయక చవితి రోజు పులిహోర ప్రసాదంనకు కావలసిన పదార్ధాలు మరియు తయారి విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. గణేశునికి ఇష్టమైన చింతపండు పులిహోర తయారీకి..

కావాల్సిన పదార్థాలు:
బియ్యం: 1 కప్పు
చింతపండు: స్వల్పంగా
పసుపు: 1 టేబుల్ స్పూన్
పల్లీలు: 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీ స్పూన్
శెనగపప్పు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు: 4
నూనె: తగినంత
ఉప్పు: తగినంత
పచ్చిమిర్చి: 4
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
కరివేపాకు: తగినంత

తయారీ విధానం:
ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టాలి.బియ్యాన్ని కడిగి కొద్దిసేపు నానబెట్టి, పొడిపొడిగా అన్నం వండుకోవాలి.ఒక పెద్ద గిన్నెలో చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసి చిక్కగా ఉడికించాలి.
ఒక కడాయిలో నూనె వేసి, ఆవాలు, శెనగపప్పు వేయించాలి. అందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.పులిహోర కలపడానికి వీలైన పెద్ద ప్లేట్ తీసుకుని, అందులో వండిన అన్నం, కొద్దిగా నూనె, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత ఉడికించిన చింతపండు రసం, తగినంత ఉప్పు వేసి మళ్లీ కలుపుకోవాలి.
చివరగా, ముందుగా వేయించిన పల్లీలు, జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి సమగ్రంగా కలపాలి.ఇలా చేస్తే రుచికరమైన చింతపండు పులిహోర సిద్ధం!

