Kitchen tips:ఆకుకూరలు వాడిపోకుండా ఉంచే సూపర్ టిప్స్.. ఈ చిట్కాలు తప్పక పాటించండి!
Kitchen tips:ఆకుకూరలు వాడిపోకుండా ఉంచే సూపర్ టిప్స్.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ అవి త్వరగా వాడిపోవడం వల్ల పోషకాలు కోల్పోతాయి. అయితే కొన్ని సులువైన టిప్స్‌తో ఆకుకూరలను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
మార్కెట్లో కొన్న ఆకుకూరలు పచ్చగా, మంచి వాసనతో ఉంటాయి. కానీ ఇంటికి తెచ్చి ఒక్క రోజు పక్కన పెట్టినా వాడిపోతాయి. దాంతో చాలాసార్లు పడేయాల్సి వస్తుంది. కానీ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే 7 నుంచి 10 రోజుల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.
కడిగే సరైన విధానం
చాలామంది ఆకుకూరలు కొన్న వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఇది పెద్ద తప్పు! తడిసిన ఆకులు త్వరగా పాడవుతాయి. కాబట్టి ముందుగా పొడి గుడ్డతో దుమ్ము, కీటకాలు తుడిచేయాలి. వాడే ముందు మాత్రమే కడగాలి. ఇలా చేస్తే ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
పేపర్లో చుట్టి ఉంచండి
ఫ్రిజ్‌లో నేరుగా పెట్టడం వల్ల తేమ ఎక్కువై ఆకులు వాడిపోతాయి. కాబట్టి పేపర్లో చుట్టి పెట్టండి. పేపర్ అదనపు తేమను పీల్చేసి తాజాదనాన్ని కాపాడుతుంది. కొత్తిమీరను చిన్నగా కట్ చేసి ప్లాస్టిక్ బాక్స్‌లో పెడితే 5-6 రోజులు తాజాగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ టెంపరేచర్ సరిగ్గా సెట్ చేసుకోండి. ఎక్కువ చల్లదనం వల్ల ఫ్రీజ్ అయి పాడవుతాయి. సరైన ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.
నీటిలో నిల్వ చేయడం
కొత్తిమీర, పుదీనా వంటి మెత్తని ఆకుకూరలను నీటిలో ఉంచవచ్చు. గాజు గ్లాస్లో కొద్దిగా నీరు పోసి, కాడలను ముంచి, పైన ప్లాస్టిక్ కవర్ వేసి ఫ్రిజ్‌లో పెట్టండి. ప్రతి రెండు రోజులకు నీరు మార్చండి. ఇలా చేస్తే వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
ఫ్రిజ్ బాక్స్‌లో చిన్న బియ్యం ప్యాకెట్ లేదా సిలికా జెల్ ప్యాక్ ఉంచండి. ఇవి తేమను పీల్చి నిల్వ కాలాన్ని పెంచుతాయి. కానీ ప్యాకెట్ ఆకులను తాకకుండా జాగ్రత్త పడండి. వాడే ముందు ఉప్పు కలిపిన నీటిలో 5 నిమిషాలు నానబెట్టండి. ఇది పురుగులు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే?
పాలకూర, మెంతకూర వంటివి ఎక్కువకాలం ఉంచాలంటే.. కొద్దిసేపు వేడి నీటిలో పెట్టి, తర్వాత చల్లని నీటిలో వేసి తుడిచి, రంధ్రాలున్న ప్లాస్టిక్ కవర్లో ఫ్రీజర్‌లో పెట్టండి. వాడే రోజు బయటకు తీస్తే సరిపోతుంది. ఆకులు కొంచెం వాడిపోతే పారేయకుండా.. ఐస్ క్యూబ్స్ వేసిన చల్లని నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. మళ్లీ పచ్చగా, తాజాగా మారతాయి!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

