Business

Money Tips:మహిళలు చీరల షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటిస్తే… ఏటా రూ.50 వేలు సేవ్ చేసుకోవచ్చు!

Money Tips:మహిళలు చీరల షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటిస్తే… ఏటా రూ.50 వేలు సేవ్ చేసుకోవచ్చు..మహిళలు తమ జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే ప్రతి నెలా డబ్బు ఆదా చేయవచ్చు. ముఖ్యంగా దుస్తులు, మరీ ముఖ్యంగా చీరల షాపింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటే ఏటా భారీ మొత్తం సేవ్ అవుతుంది. ఎలా? రండి తెలుసుకుందాం.

చీరల వ్యాపారుల మాయలు… ఇవే!
లేటెస్ట్ డిజైన్ల పేరుతో అధిక ధరలు: పెద్ద షోరూమ్‌లలో ఒకే డిజైన్ చీర రూ.5,000కి ఉంటే, చిన్న షాపుల్లో రూ.2,000–3,000కే దొరుకుతుంది.
హోల్‌సేల్ మార్కెట్ మ్యాజిక్: అదే చీర హోల్‌సేల్‌లో రూ.1,000–1,500 మధ్యలో లభిస్తుంది.
టిప్: ఒకటికి రెండు షాపులు సరిపోల్చి చూస్తే ధరల తేడా స్పష్టమవుతుంది.
ఇది కూడా చదవండి:మహిళలు ఇంటి నుంచి కదలకుండా నెలకు రూ.50 వేలు సంపాదించే సులభమైన బిజినెస్… ఏం చేయాలంటే?
బేరం ఆడటం… తప్పనిసరి!
వ్యాపారులు సాధారణంగా 100% లాభం పెట్టుకుంటారు.మొహమాటం వద్దు! ఆఫర్ల మోజులో పడకుండా క్వాలిటీ, ధర సరిపోల్చండి.ఒకటికి రెండు షాపుల్లో చెక్ చేయకుండా కొనొద్దు.

హోల్‌సేల్ మార్కెట్ ట్రిక్… అద్భుతం!
హైదరాబాద్‌లోని మదీనా వంటి ప్రాంతాల్లో గ్రూప్ షాపింగ్ చేయండి.మహిళలు కలిసి బృందంగా వెళితే హోల్‌సేల్ ధరే లభిస్తుంది.
ఆన్‌లైన్ యాప్స్: తక్కువ ధరకు చీరలు దొరుకుతాయి – ఈ అవకాశాన్ని వదులుకోకండి.
ఇది కూడా చదవండి:ఈ ఒక్క నూనె రాస్తే… తెల్ల జుట్టు కూడా నల్లగా మెరిసిపోతుంది
ఫలితం?
చీరలు, మిగతా దుస్తుల షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏటా రూ.30,000 నుంచి రూ.50,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఆ డబ్బును మీ ఇతర అవసరాలకు ఉపయోగించుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.