Kitchenvantalu

Kitchen Tips:మాడిపోయిన గిన్నెలు తోమి తోమి విసిగిపోయారా? ఒక్క మట్టి ప్రమిదతో కొత్తవాటిలా మెరిపించేయండి!

Kitchen Tips:మాడిపోయిన గిన్నెలు తోమి తోమి విసిగిపోయారా? ఒక్క మట్టి ప్రమిదతో కొత్తవాటిలా మెరిపించేయండి.. వంటగదిలో పని చేసేటప్పుడు పొరపాట్లు సహజం. పాలు మరిగిస్తున్నప్పుడో, కూర చేస్తున్నప్పుడో కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. గిన్నె మాడిపోతుంది.

ఇక ఆ నల్లటి మొండి మరకల్ని వదిలించడానికి గంటల తరబడి స్క్రబ్ చేసి చేతులు నొప్పులు పుట్టడం ఖాయం. కానీ, ఇకపై ఆ కష్టం అక్కర్లేదు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ పూనమ్ దేవ్నాని సూచించిన ఒక వైరల్ చిట్కా ఇప్పుడు గృహిణులకు ఎంతో ఉపయోగపడుతోంది. అదేంటో చూద్దాం.
ALSO Read:తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం.. డై వద్దు.. ఈ నేచురల్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోండి!
కావాల్సిన పదార్థాలు:
మట్టి ప్రమిద (దీపావళికి వాడే ప్రమిద) – 1
బేకింగ్ సోడా – 1 టీస్పూన్
షాంపూ – 1 చిన్న ప్యాకెట్ (లేదా ఒక స్పూన్)
నిమ్మరసం – కొద్దిగా
నీళ్లు – తగినన్ని

తయారీ మరియు వాడే విధానం:
ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకుని రోట్లో లేదా కవర్‌లో పెట్టి మెత్తటి పొడిలా దంచుకోవాలి. ఇది ఎర్రమట్టి పౌడర్‌లా మారుతుంది.ఈ పొడిలో బేకింగ్ సోడా, షాంపూ, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి.మాడిపోయిన స్టీల్ గిన్నె లేదా పాన్‌పై ఈ పేస్ట్‌ను పట్టించి, స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దాలి.
ALSO READ:14 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన చిట్కా.. వాము, సోంపుతో ఇలా చేస్తే చాలు!
మట్టిలోని గరుకు స్వభావం, బేకింగ్ సోడాలోని క్లీనింగ్ గుణాల వల్ల మొండి మరకలు నిమిషాల్లో మాయమై, గిన్నె తళతళలాడుతుంది. ఇది స్టీల్ గిన్నెలకే కాదు, దోసె పెనం (Iron Tawa), కడాయిలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.మట్టి ప్రమిద లేకపోతే.. గిన్నెలో నీళ్లు, వెనిగర్ వేసి 10 నిమిషాలు మరిగించినా మరకలు సులువుగా పోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/