Indian Air Force Jobs :తెలుగు యువతకు బంపర్ ఛాన్స్: ఇంటర్ పాసయ్యారా? ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం!
Indian Air Force Jobs :తెలుగు యువతకు బంపర్ ఛాన్స్: ఇంటర్ పాసయ్యారా? ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) లో ఉద్యోగం సాధించడం మీ కలా? అయితే మీకో గుడ్ న్యూస్. డిగ్రీలు, పీజీలు అక్కర్లేదు.. కఠినమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిన పనేలేదు. కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు.. భారతీయ వాయుసేనలో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
అగ్నివీర్ వాయు (Agniveer Vayu) నియామకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువతీయువకుల కోసం ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. దీనికి ముందస్తు ఆన్‌లైన్ దరఖాస్తు కూడా అవసరం లేదు. సర్టిఫికెట్లు పట్టుకుని నేరుగా ర్యాలీకి వెళ్లిపోవచ్చు!ఈ అద్భుతమైన అవకాశం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
ఎక్కడ? ఎప్పుడు?
వేదిక: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU), గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
తేదీలు: మార్చి 9 (ఈ రోజు) నుంచి మార్చి 16 వరకు.
రిపోర్టింగ్ టైమ్: ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు (ఆలస్యమైతే అనుమతించరు).
ఎవరెవరు ఏ రోజు వెళ్లాలి?
అభ్యర్థుల రద్దీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ వారికి విడివిడిగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
మార్చి 9, 10: ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల అభ్యర్థుల అర్హతల పరిశీలన మరియు ఫిట్‌నెస్ పరీక్షలు.
మార్చి 12, 13: కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుష అభ్యర్థులకు (మార్చి 12న ఉదయం రిపోర్ట్ చేయాలి).
మార్చి 15, 16: కేవలం తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు (మార్చి 15న ఉదయం రిపోర్ట్ చేయాలి).
అర్హతలు ఏంటి?
ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన కోర్సు పాస్ అయి ఉండాలి. (పాలిటెక్నిక్/ఐటీఐ చేసినవారు కూడా అర్హులే).మొత్తం మార్కుల్లో కనీసం 50 శాతం, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 17 1/2 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి (అంటే జులై 2, 2005 – జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి). అవివాహితులై ఉండాలి.
ఎత్తు: కనీసం 152 సెం.మీ ఉండాలి (మహిళలకు కూడా).
ఎంపిక ఎలా జరుగుతుంది?
ముందుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి, ఎత్తు కొలుస్తారు.ఆ తర్వాత 1.6 కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుంది. (పురుషులు 7 నిమిషాల్లో, మహిళలు 8 నిమిషాల్లో పూర్తి చేయాలి).పుష్ అప్స్, సిట్ అప్స్, స్క్వాట్స్ లాంటి ఫిజికల్ టెస్టులు ఉంటాయి.వీటిలో పాస్ అయిన వారికి రాత పరీక్ష ఉంటుంది. అందులో సెలెక్ట్ అయితే అగ్నివీర్‌గా వాయుసేనలో చేరొచ్చు!
ర్యాలీకి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సినవి:
ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు (లేదా డిజిలాకర్ ద్వారా వెరిఫై చేసినవి)
డొమిసైల్ (స్థానిక ధ్రువీకరణ), ఆధార్ కార్డ్
ఎన్‌సీసీ (NCC) సర్టిఫికెట్ (ఉంటే)
10 లేటెస్ట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
పైన చెప్పిన అన్ని సర్టిఫికెట్ల 6 సెట్ల జిరాక్స్ కాపీలు
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in ను సందర్శించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. దేశసేవ చేసే ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోకండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

