Face care tips:బ్యూటీ పార్లర్‌తో పనిలేదు.. ఇంట్లోనే ఈ క్రీమ్ తయారు చేసుకుంటే నల్లటి ముఖం కూడా తెల్లగా మెరిసిపోతుంది!
Face care tips:బ్యూటీ పార్లర్‌తో పనిలేదు.. ఇంట్లోనే ఈ క్రీమ్ తయారు చేసుకుంటే నల్లటి ముఖం కూడా తెల్లగా మెరిసిపోతుంది.. ముఖం తెల్లగా, అందంగా, కాంతివంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ డబ్బులు ఖర్చు పెడుతుంటారు.
అయినా ఆశించిన ఫలితం రాక నిరాశ చెందుతుంటారు. అలాంటి వారి కోసం ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా ఇక్కడ ఉంది. దీన్ని వాడితే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవటం ఖాయం!
కావాల్సిన పదార్థాలు:
కలబంద (Aloe vera)
క్యారెట్
బియ్యం పిండి
తయారీ విధానం:
ముందుగా తాజా కలబందను తీసుకుని అందులోని జెల్‌ను తీయాలి. ఆ జెల్‌ను మెత్తని పేస్ట్‌లా చేసి, వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ జెల్‌ను పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ తీసుకుని, పై తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలి. ఆ తురుమును మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసి జ్యూస్ తీయాలి.
ఈ క్యారెట్ జ్యూస్‌లో రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో (వేడి నీళ్లు ఉన్న గిన్నెలో ఈ మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి) వేడి చేయాలి. ఇది క్రీమ్ లాగా మారే వరకు కలుపుతూనే ఉండాలి.
క్రీమ్ లాగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అందులో ముందుగా ఫ్రిజ్‌లో పెట్టుకున్న కలబంద జెల్‌ను వేసి బాగా కలపాలి. అంతే.. ముఖాన్ని మెరిపించే మ్యాజికల్ క్రీమ్ రెడీ!
ఎలా వాడాలి?
ఈ క్రీమ్‌ను రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా రాసుకోవాలి. సరిగ్గా పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక ముఖ్య గమనిక ఏంటంటే.. ముఖం కడుక్కునేటప్పుడు సబ్బును అస్సలు వాడకూడదు. మరుసటి రోజు ఉదయం మాత్రమే సబ్బుతో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ క్రీమ్‌ను రాత్రి సమయంలోనే వాడాలి.
దీని వల్ల ఉపయోగాలు:
క్యారెట్లో ఉండే విటమిన్-A చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలను పూర్తిగా తగ్గిస్తుంది.కలబంద (ఆలోవెరా) ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను (Dead cells) తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖానికి ఎంతో చల్లదనం లభిస్తుంది.ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు రాత్రే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

