Healthhealth tips in telugu

తెల్ల ఆవాలులో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు…ఇది నిజం

white mustard seeds benefits : ఆవాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాలు రెండు రకాలున్నాయి.. నలుపు ఆవాలు, తెలుపు ఆవాలు. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎప్పుడూ నల్ల ఆవాలు గురించే ఎందుకు.. తెలుపు ఆవాలు తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. ఈ ఆవాల్లో డైటరీ ఫాట్స్, కార్బొహైడ్రేట్స్, ఫాట్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, జింక్, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి.
white musterd powder
ఈ ఆవాలతో తయారుచేసిన నూనెను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెలో న్యూటియన్ ఫాక్ట్స్ ఎక్కువ. చేపలతో తయారుచేసి వంటకాల్లో ఈ ఆవాల పొడి చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆవాల పొడిని సలాడ్స్, సూప్స్ వంటి వాటిల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
gas troble home remedies
తెల్ల ఆవాలు శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం ద్వారా, లాలాజలం ఉత్పత్తి 8 రెట్లు పెరుగుతుంది. ఇది నిజానికి ఆహారం యొక్క జీవక్రియ మరియు జీర్ణక్రియ ప్రక్రియను పెంచడానికి సహాయపడుతుంది. తెల్ల ఆవాలలో మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి.

ఈ పోషకాలు రక్తపోటును సమతుల్యం చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. తెల్ల ఆవాలులో పొటాషియం మరియు కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కండరాల తిమ్మిరి,నరాల బలహీనతను తగ్గించటమే కాకుండా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.

తెల్ల ఆవాల నుండి తయారైన ఆవాల నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. గొంతు మరియు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం బయటకు పంపడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.