Devotional

శబరిమల వెళ్తున్నారా ? అయితే ఇది మీ కోసమే

ట్రావెన్‌కోర్‌ దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.శబరిమల అయ్యప్ప ఆలయ గర్భగుడి సమీపానికి మొబైల్ ఫోన్ లు తీసుకెళ్లడం నిషేధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే అయ్యప్ప దేవస్థానంలో మహిళా భక్తులు దర్శనం దర్శనం చేసుకునే విషయంలో వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా నిషేధించడం సంచలనంగా మారింది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే అయ్యప్ప దేవాలయం చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మొబైల్ ఫోన్ ల నిషేధం పై నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల కొంతమంది భక్తులు స్వామివారి వీడియో ని తీసి సోషల్ మీడియాలో పెట్టడం బాగా వైరల్ అయింది.శబరిమల ఆలయాన్ని ఇటీవల సందర్శించిన దేవస్థానం అంబుడ్స్‌మన్, జస్టిస్ పి.ఆర్ రామన్ ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానంలో మొబైల్ ఫోన్ నిషేధించాలంటూ సూచించారు.

అయితే గత ఏడాది కూడా శబరిమల ఆలయం తో పాటు అనేక ట్రావెన్‌కోర్‌ దేవస్థానం పరిధిలో ఉన్న దేవాలయాల్లో మొబైల్ ఫోన్లు నిషేధించారు.కానీ ఆ తరువాత అంతగా పట్టించుకోలేదు.ప్రస్తుతం భద్రతా చర్యల్లో భాగంగా మొబైల్ ఫోన్ విషయంలో కఠినంగా ఉండాలని దేవస్థానం బోర్డు భావిస్తోంది.