Movies

తెలుగు సంగీత దర్శకులు ఒక్కో సినిమాకు ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

ఒక సినిమా హిట్ కొట్టాలంటే అందులో పాటలకు మంచి ప్రాధాన్యత ఉండాలి. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మరింతలా కీలకంగా వ్యవహరించే సంగీత దర్శకుల రెమ్యునరేషన్ చూస్తే భారీగానే ఉంటుందట. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ కేవలం వెయ్యి రూపాయల జీతం నుంచి కెరీర్ స్టార్ట్ చేసి,సినిమా మార్కెట్ ని బట్టి 10కోట్ల వరకూ డిమాండ్ చేస్తూ,దక్షిణాదిలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచాడు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఒక్కో సినిమాకు 5కోట్లు వరకూ అందుకుంటున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి మూవీస్ కి సంగీతం అందించే కీరవాణి ఒక్కో సినిమాకు కోటిన్నర పుచ్చుకుంటాడని టాక్.

1990ల్లోనే ఒక్క పాటకు 90వేల రూపాయల దాకా అందుకున్న మణిశర్మ 50లక్షల దాకా వెళ్ళాడు. కొన్ని మూవీస్ కి బడ్జెట్ ని బట్టి రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మళ్ళీ దూకుడు పెంచాడు రాక్ స్టార్ గా పేరొందిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటిదాకా ఒక్కో మూవీకి 2కోట్లు తీసుకుంటే,ఇప్పుడు 3కోట్ల వరకూ అందుకుంటున్నాడట. వరుస సినిమాలు చేస్తున్న తమన్ కోటికి పైనే డిమాండ్ చేస్తున్నాడట. తెలుగులో దృవ మూవీకి మంచి సంగీతం అందించిన ఆదిత్య రామచంద్రన్ తమిళంలో ఒక్కో మూవీకి 75లక్షల దాకా తీసుకుంటాడని వినిపిస్తోంది. ఇక కాలా వంటి మూవీస్ కి సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ 75లక్షలు తీసుకుంటున్నాడు.

గీత గోవిందం మూవీతో తానేమిటో సత్తా చాటిన గోపి సుందర్ రెమ్యునరేషన్ 50లక్షల పైనే అందుకుంటున్నట్లు టాక్. మిక్కీ జె మేయర్ వరుస హిట్స్ తో మొన్నటిదాకా 40లక్షల దాకా అందుకున్నప్పటికీ ప్రస్తుతం 70లక్షలు దాటిపోయాడట. కొలవరి సాంగ్ తో వరల్డ్ ని ఓ ఊపు ఊపేసిన అనిరుధ్ మొదట్లో కేవలం 5లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే అతి తక్కువ సమయంలోనే రెండు కోట్లకు చేరాడు. యావన్ శంకర్ రాజా ఒక్కో సినిమాకు కోటిన్నర దాకా అందుకుంటున్నాడు. ఇక అనూప్ రూబెన్స్ సినిమా బడ్జెట్ ని బట్టి బాగానే అందుకున్నప్పటికీ ఇప్పుడు 40లక్షల లోపే నడుస్తోందట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి స్పెషలిస్ట్ గా నిల్చిన జిబ్రాన్ 40లక్షల దాకా తీసుకుంటున్నాడట.