తమ్ముడిని కోల్పోయిన ఆ గుర్తులు ఇంకా వీడలేదు
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత మరియు మెగాస్టార్ చిరంజీవి బావమరిది. అల్లు అరవింద్ టాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలను చేసారు. ఎంతో మంది కొత్త డైరెక్టర్స్,హీరోలు,హీరోయిన్స్ లను పరిచయం చేసారు. అంత గొప్ప నిర్మాత అయిన అల్లు అరవింద్ గారికి కూడా బాధ, ఆనందం అనేవి ఉంటాయి. అల్లు అరవింద్ గారికి పుత్ర శోకం కలిగిందట. అల్లు అరవింద్ గారికి ముగ్గురు కొడుకులు అన్న సంగతి మనకు తెలిసిందే.
వారిలో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో మనకు తెలుసు. ఇక మరో కొడుకు అల్లు శిరీష్ విజయం కోసం ఇంకా ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు. వీరిద్దరూ కాకా అల్లు అరవింద్ కి మరొక కొడుకు వెంకటేష్ ఉన్నాడు.
చెన్నై ఆస్ట్రేలియా లలో చదివిన వెంకటేష్ కాస్త మీడియాకు దూరంగా ఉంటారు. అల్లు అరవింద్ ముగ్గరు కొడుకుల గురించి దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. అయితే అసలు విషయంలోకి వస్తే అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు కాదట…నలుగురు కొడుకులు అట.
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అయిన అల్లు వెంకటేష్ మరియూ అల్లు అర్జున్ ల మధ్య అల్లు అరవింద్ గారికి ఇంకొక కుమారుడు జన్మించాడు. అతని పేరే అల్లు రాజేష్అ. ల్లు అరవింద్ గారి రెండోవ తనయుడు అయిన రాజేష్ తన ఏడవ ఏటనే రోడ్ ప్రమాదంలో మరణించాడు.
అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు రాజేష్ చనిపోయాక అల్లు శిరీష్ పుట్టటం వలన ఆ కొడుకును శిరీష్ లో చూసుకొని ఆ బాధను మర్చిపోయారట.