Movies

రాకింగ్ రాకేష్ టీం దీవెన ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?

‘జబర్దస్త్’ కార్యక్రమం టాప్ రేటింగ్ లో దూసుకుపోతూ మంచి ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎవరికైనా చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని జారవిడుచుకోవటానికి ఇష్టపడరు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు దూసుకుపోతారు. అలాగే ‘జబర్దస్త్’ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే పార్టీ ఒక్కరు మంచి పేరుతొ పాటు సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవటమే కాకుండా ఆర్ధికంగా కూడా బాగా స్థిరపడ్డారు.

‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఎటువంటి స్కిట్స్ చేయాలి. ఆ స్కిట్స్ లో ఎవరిని తీసుకోవాలి. వంటి విషయాలను మల్లెమాల వారు టీమ్ లీడర్స్ కి అప్పగించారు. అంతేకాక స్కిట్ కి సంబంధించి బడ్జెట్ కూడా టీం లీడర్ కి ఇవ్వటంతో ఆ బడ్జెట్ లో అయ్యేలా ప్లాన్ చేస్తాడు.

స్కిట్ లో పార్టిసిపేట్ చేసేవారికి ఎంత ఎమౌంట్ ఇవ్వాలనేది కూడా టీమ్ లీడర్ ఇష్టప్రకారమే జరుగుతుంది. అందుకే హైపర్ ఆది ఈ విషయంపై కూడా చాలా సార్లు పంచ్ లు వేసాడు. టీమ్ లీడర్స్ కి ఎక్కువ వస్తుందని,పార్టిసిపెంట్స్ చాలా తక్కువ వస్తుందని పంచ్ లు వేసాడు.

టీమ్ లీడర్స్ సీనియర్ ఆర్టిస్ట్ లను తీసుకువస్తే వారికీ ఎక్కువగా డబ్బులు ఇవ్వవలసి వస్తుందని కొంత మంది సీనియర్స్,కొంత మంది కొత్తవారిని తీసుకోని స్కిట్స్ చేస్తూ రక్తి కట్టిస్తున్నారు.

ఇక రాకింగ్ రాకేష్ విషయానికి వస్తే.. ఇతను చాలా డిఫెరెంట్ గా చిన్న పిల్లలను తీసుకువచ్చి స్కిట్స్ చేస్తున్నాడు. ఆ స్కిట్స్ కూడా బాగా విజయవంతం అయ్యాయి. ఇలా రాకేష్ చాలా తక్కువ బడ్జెట్ తో స్కిట్స్ ని ముగించేస్తున్నాడు.

రాకేష్ టీమ్ లో ఉన్న దీవెన విషయానికి వస్తే…దీవెన తండ్రి డబ్బులు ఏమి వద్దని మా అమ్మాయి టాలెంట్ ఎలివేట్ అయితే చాలని చెప్పి దీవెనను రాకేష్ కి అప్పగించాడట. దాంతో దీవెన రాకేష్ టీమ్ లోకి చేరి మంచి పేరు తెచ్చుకుంది. ఇలాంటి దీవెన లాంటి వారికి ‘జబర్దస్త్’ వంటివి మంచి ప్లాట్ ఫామ్ గా నిలుస్తున్నాయి.