Movies

గుండు హనుమంతరావు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

హాస్యనటుడు గుండు హనుమంతరావు గారు విజయవాడలో 1956 అక్టోబర్ 10న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కాంతారావు, సరోజినీ. హనుమంతరావుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1974 లో 18 ఏళ్ల వయస్సులో ఆయన నాటక రంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో హనుమంతరావు వేసిన మొదటి వేషం రావణ బ్రహ్మ. అహన పెళ్ళంట చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సుమారుగా 400 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా అనేక టీవీ సీరియల్స్ లో నటించారు. గుండు సినిమాల్లో నటించక ముందు మిటాయి వ్యాపారం చేసేవాడు.
అమృతం అనే టీవీ సీరియల్ గుండు హనుమంతరావు కి మంచి పేరు తెచ్చి పెట్టింది. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. హనుమంతరావు నటించిన ప్రముఖ చిత్రాల విషయానికి వస్తే…బాబాయ్ హోటల్, కొబ్బరి బొండాం, యమలీల, హై హై నాయకా, ప్రేమ, మాయలోడు, పేకాట పాపారావు, నంబర్ వన్, శుభలగ్నం, వజ్రం, క్రిమినల్, వినోదం, కలిసుందాం రా, సత్యం, అతడు, భద్ర, అన్నమయ్య, రిక్షావోడు.హనుమంతరావు కు బాగా ఇష్టమైన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 19 ఉదయం ౩ గంటల సమయంలో స్వగృహంలో మరణించారు.